Prashant Kishor : ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటున్న ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

Share the news
Prashant Kishor : ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటున్న ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

Prashant Kishor on AP Elections 2024 Results

మరికొద్ది రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP) పార్టీ కచ్చితంగా ఓడిపోతుందన్నారు. అది కూడా మాములుగా కాదు జగన్ పార్టీ భారీ తేడాతో ఓటమి చెందుతుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక The New Indian Express ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని, భారీ తేడాతో ఓడిపోతుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం ఉచితాలు అంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని, ఉద్యోగాల కల్పన, అభివృద్ధిలపై సైతం ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నారు. పథకాలతో మాత్రమే ఓట్లు రావని, ప్రజలకు అన్నీ అందుతున్నాయని చెప్పుకోవడం కాదని, అభివృద్ధి కోసం ముందడుగు వేయాలన్నారు. జగన్ చేసిన తప్పులవల్ల రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

See also  CBN and Pawan Dinner Politics: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరో కీలక భేటీ! ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు!

గత ఎన్నికల్లో వైసీపీ కి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్, ఇంతకు ముందు కూడా జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) పాలనా తీరుకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు చేశారు. వివిధ మీడియా చానళ్ల డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు..ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డితో పనిచేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారని కూడా ఓ సారి చెప్పారు. మరల ఇప్పడు వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందుతుందని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇది వైసీపీ క్యాంపును దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.

:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top