India is not a country: ‘భారతదేశం ఒక దేశం కాదు’ డిఎంకె ఎంపి ఎ రాజా నోటి దురద..

India is not a country: జై శ్రీరామ్, భారత్ మాత అనే బీజేపీ సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించదని డీఎంకే ఎంపీ ఏ రాజా వ్యాఖ్యానించారు. అది ఒకే గాని ఏకంగా 'భారతదేశం ఒక దేశం కాదు' అని కూడా సెలవిచ్చాడు.
Share the news
India is not a country: ‘భారతదేశం ఒక దేశం కాదు’ డిఎంకె ఎంపి ఎ రాజా నోటి దురద..

ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) సనాతన ధర్మం గురించి చెడ వాగిన దానికి నిన్న సుప్రీమ్ కోర్టు గడ్డి పెట్టింది. అయన అది సరిపోలేదనుకుంటా? ఇప్పుడు డీఎంకే(DMK) ఎంపీ ఎ రాజా(A Raja) ఏకంగా భారతదేశం ఒక దేశం కాదు(India is not a country)’ అని సెలవిచ్చాడు.

జై శ్రీరామ్, భారత్ మాత అనే బీజేపీ(BJP) సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించబోదని డీఎంకే ఎంపీ ఎ రాజా మంగళవారం అన్నారు. తమిళనాడులోని అధికార పార్టీపై బిజెపి వెంటనే విరుచుకుపడింది, “DMK నుండి ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి” అని.

India is not a country అన్న డిఎంకె ఎంపి ఎ రాజా!

మదురైలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా మాట్లాడుతూ, “వారు (బిజెపి) చెప్పే ప్రకారం ఈ దేవుడు, ఇదిగో జై శ్రీరామ్, ఇది భారత్ మాతా కీ జై అని చెబితే, మేము మరియు తమిళనాడు ఎప్పటికీ భారత్ మాతా మరియు జై శ్రీరామ్ ను అంగీకరించదు.” దానితో పాటు రామాయణం గురించి అవాకులు చెవాకులు పేలాడు. ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ “భారతదేశం ఒక దేశం కాదు(India is not a country ), ఉపఖండం” అని అన్నారు. “ఒకే దేశం అంటే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి అని, భారతదేశం ఒక దేశం కాదు(India is not a country ), ఉపఖండం” అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు.

See also  Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 విభిన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

“ఒక సమాజం గొడ్డు మాంసం తింటుంటే, దానిని గుర్తించండి. మణిపూర్‌లో ఎవరైనా కుక్క మాంసం తింటే, అది వారి సంస్కృతిలో ఉంది. మీ సమస్య ఏమిటి? వారు మిమ్మల్ని తినమని అడిగారా?” అన్న ఎ రాజా. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని డీఎంకే ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత డీఎంకే లేకపోతే భారత్‌ ఉండదని ఆయన అన్నారు.

‘‘బీజేపీ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని విసిరి వేయాలనుకుంటున్నారు.. భారత్‌ ఉండదని నేనెందుకు అన్నాను.. బీజేపీ వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు.. రాజ్యాంగం లేకపోతే భారత్‌ ఉండదు.. భారతదేశం లేకపోతే, తమిళనాడు తమిళనాడుగా ఉండదు మరియు మేము విడిపోతాము, భారతదేశానికి ఇది కావాలా?”

ఇక భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా(Amit Malviya), రాజా భారతదేశం విభజన కోసం వాదిస్తున్నారని, రాముడి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. X లో ఒక పోస్ట్‌లో, మాల్వియా ఇలా అన్నారు, “DMK నుండి ద్వేషపూరిత ప్రసంగాలు ఇలా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తరువాత, భారతదేశం విభజన కోసం పిలుపునిచ్చిన ఎ రాజా, భగవాన్ రామ్‌ను అవహేళన చేస్తూ, మణిపురిలపై కించపరిచే వ్యాఖ్యలు మరియు ఒక దేశంగా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించడం దానికి సూచన .”

See also  YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్!

కొసమెరుపు: ఎవరైనా బీజేపీని వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ దేశాన్ని వ్యతిరేకిస్తే అది రాజద్రోహం అవుతుంది. ఎమ్మెల్యే లు, ఎంపీ లుగా చేస్తూ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతారు వీళ్ళు. భారతదేశానికి చైనా మరియు పాకిస్థాన్ బాహ్య శత్రువులు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్), కేజ్రీవాల్ (ఆప్), మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), ఉదయనిధి స్టాలిన్, ఏ రాజా (డీఎంకే) లాంటి వారు అంతఃగత శతృవుల్లా ఉన్నారు. బీజీపీ మీద కోపం ఉంటే, బీజేపీ మీద చూపించ కుండా దేశం పరువు తీస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించరాని విషయం.

.

Also Read News

Scroll to Top