RC 16: రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్.. ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్!

Share the news
RC 16:  రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్.. ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్!

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్

రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం RC 16 కోసం, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చి బాబు సానాతో(Buchi Babu Sana) జతకట్టబోతోన్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు మైత్రీ మూవీ మేకర్స్ వారు జాన్వీ కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. హీరోయిన్‌గా కంఫర్మ్ చేశారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సమర్పిస్తున్న RC 16 చిత్రాన్ని వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్( Janhvi Kapoor) హీరోయిన్ అని కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని హీరోయిన్ తండ్రి బోని కపూర్ కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇప్పుడు ఫైనల్‌గా ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor) హీరోయిన్‌ అని మేకర్స్ కంఫర్మ్ చేశారు. జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

See also  RRRని వదలని జపాన్ ప్రేక్షకులు

ఈ అధికారిక ప్రకటనతో.. ఆర్‌సి16 (RC16) హీరోయిన్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చేసినట్లయింది. ఇకపోతే ప్రముఖులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో డైలాగ్‌లను అనర్గళంగా చెప్పగల నటీనటుల అన్వేషణను ఇటీవల యూనిట్ జరిపింది. ప్రముఖ తారాగణం నటించనున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక సంగీతం ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) అందించనున్నారు. త్వరలోనే మేకర్స్ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top