TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

Share the news
TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

TS SSC 2024 Hall Tickets Released

TS SSC 2024 Hall Tickets: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌ టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ప్రైవేట్/ ఓపెన్ స్కూల్/ ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లను కూడా విడుదల చేశారు. తమ తమ పాఠశాలల లాగిన్‌ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ప్రకారం పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు (TS SSC Exams 2024) నిర్వహించనున్నారు.

ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానుండగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

See also  AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ వేటు!

Telangana SSC 2024 Hall Tickets డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం దిగువన చూడండి

పదోతరగతి హాల్‌టికెట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎగ్జామ్ టైం టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top