
ఎన్డీయే(NDA) లో టీడీపీ(TDP), జనసేన(Janasena) చేరిక ఖరారే కానీ సీట్ల పంపకాల చర్చలు(Seat-Sharing Talks) ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దాంతో సీట్ల పంపకాల చివరి దశ చర్చల(Seat-Sharing Talks) కోసమై గురువారం చంద్రబాబు నాయుడు(Chandra Babu) మరియు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాత్రి 10.30 గంటలకు అమిత్ షా నివాసానికి చేరుకున్నారు మరియు మూడు పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్‌సభకు వచ్చే ఎన్నికల కోసం పొత్తుపై చర్చించారు.
చివరి దశకు చేరిన Seat-Sharing Talks
పొత్తులో భాగంగా ముఖ్యంగా బీజేపీ(BJP)కి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగనట్లు తెలుస్తుంది. టీడీపీ, జనసేనలు ఇప్పటికే సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. బీజేపీ(BJP) అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ను కలవడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక రాత్రి 8 గంటల ప్రాంతంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వచ్చారు. ఇద్దరూ కలిసి రాత్రి 10.30 గంటలకు అమిత్‌షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చర్చల్లో పాల్గొన్నారు.
గంటన్నర పాటు సుదీర్ఘ భేటీ జరిగినట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… తమకు వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు కేటాయించాలని షా, నడ్డా కోరారని వినికిడి. బీజేపీ 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు కోరినట్లు తెలుస్తుంది. ‘‘అసెంబ్లీలో మీరు సాధ్యమైనన్ని సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని మాకు తెలుసు. లోక్‌సభలో కనీసం 370 స్థానాలు నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందువల్ల ప్రతి మిత్రపక్షం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువగా అడుగుతున్నాం’’ అని బీజేపీ నేతలు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే… బీజేపీ ఆశిస్తున్నన్ని స్థానాలు కాకుండా 4 లోక్‌సభ, 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని చంద్రబాబు, పవన్ పేర్కొన్నట్లు సమాచారం. షాను కలిసే ముందు పార్టీ నేతలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటీవలే పార్టీ లో చేరిన లావు కృష్ణదేవరాయలు తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు.
మలివిడత చర్చల కోసం శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండాలని, చంద్రబాబు, పవన్‌లకు బీజేపీ పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. Seat-Sharing Talks చివరి దశలో వున్నాయి కాబట్టి ఈరోజు కానీ రేపు గాని అధికారక పొత్తు ప్రకటన రావచ్చు.
కొసమెరుపు: చివరిగా బీజేపీ 6 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లలలో పోటీ చేసే అవకాశం ఉండవచ్చు. చర్చల ఎలా జరిపి తాము అనుకున్న సీట్లు ఎలా సాధించుకోవాలో బీజేపీ ని చూసి నేర్చుకోవాలి.
ఢిల్లీలో శ్రీ అమిత్ షా, శ్రీ జేపీ నడ్డా గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..@PawanKalyan @ncbn @AmitShah @JPNadda pic.twitter.com/BHzuuF4Vi6
— JanaSena Party (@JanaSenaParty) March 7, 2024