Nagababu in Nellore: వైనాట్ 175.. అంత సీన్ YCP కి ఉందా..?

Nagababu in Nellore: వైసీపీ మంత్రులు హాఫ్ బ్రెయిన్ మంత్రులంటూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Share the news
Nagababu in Nellore: వైనాట్ 175.. అంత సీన్ YCP కి ఉందా..?

రెండు రోజుల పర్యటనకోసం నెల్లూరు వచ్చిన ఆయన, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సమన్వయంతో పని చేయాలని వారికి పిలుపునిచ్చారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఖాళీ చేసిందని దాన్ని భర్తీ చేయాలంటే కనీసం దశాబ్దాల కాలం పడుతుందని అన్నారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి గానే సంక్షేమంతో పాటు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

శాసన సభలో బూతులు మాట్లాడటం, స్టేజ్ డ్యాన్స్ లు వేయడం తప్ప వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు నాగబాబు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో సజ్జల స్క్రిప్ట్ ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల్ని తిడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆదేశాలతోనే తాము అలా చేస్తున్నట్టు వారే ఒప్పుకున్నారని నాగబాబు అన్నారు.

See also  Janasainiks Fight over Poor Sanitation: పడకేసిన పారిశుధ్యంపై రేపల్లె జనసైనికుల పోరు

ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ నేత గతంలో పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారని, ఆ తర్వాత ఆయనే కనిపించకుండా పోయారన్నారు ఎక్కువమంది చదువుకోవడం వల్ల నిరుద్యోగం అంటూ వైసీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారని కానీ ప్రభుత్వం చేతగానితనం వల్లే నిరుద్యోగం ఏర్పడిందని కౌంటర్ ఇచ్చారు.

Nagababu in Nellore: వైనాట్ 175.. అంత సీన్ YCP కి ఉందా..?

సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వైనాట్ 175 అంటున్నారని, ప్రజల్ని పట్టిపీడించే రాక్షసగణం వైసీపీ అన్నిచోట్లా గెలుస్తుందంటే ఎవరు నమ్ముతారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 100 రోజులే టైమ్ ఉందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు నాగబాబు.

Nagababu in Nellore

రెండురోజులపాటు నాగబాబు నెల్లూరులో పర్యటిస్తారు. ఈరోజు కూడా ఆయన జనసేన నేతలతో సమావేశం అయ్యారు. జిల్లాలో నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన ఉద్భోదించారు.

Also Read News

Scroll to Top