
My First Vote for CBN ప్రోగ్రాం తో నూతన ఓటర్లలో ఉత్సాహం నింపిన అనగాని!
రేపల్లె(Repalle) నియోజకవర్గ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించి, అభివృద్ధికి ఆద్యుడుగా పేరొందిన యువనేత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో My First Vote for CBN లో భాగంగా నూతన ఓటర్ల పరిచయ కార్యక్రమం శనివారం నిర్వహించారు. నియోజకవర్గంలోని నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి రేపల్లె టౌన్, రూరల్ మండలం నుండి నూతన ఓటర్లు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.
తొలుత దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఒక్క చాన్స్ అంటూ అధికారంలోనికి వచ్చిన వైసీపీ పార్టీ అనుసరిస్తున్న అరాచక పాలనను ఏవి రూపంలో నూతన ఓటర్లకు వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ సైకో పాలల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిందన్నారు. భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి అంతకంటే లేదు, ప్రశ్నించే తత్వాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ అరాచక పాలన సాగిస్తున్న వ్యవస్థను చూస్తున్నాము. యువత మేల్కొనాలి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అభివృద్ధి, రాబోవు తరాలకు మంచి జరగాలననే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu), జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడి సైకో పాలనపై యుద్ధం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం వేల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో కూరుకుపోయిందని రానున్న తరాలు పై కూడా అప్పులు పెనుబారంగా మారనున్నాయి వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 28 వేల ఎకరాల భూమిని సేకరించి అభివృద్ధి చేయాలని చూస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని విమర్శించారు. తాను జైలుకు వెళ్లాడు కాబట్టి అందరిని జైలుకు పంపించాలని అక్రమ కేసులు పెడుతూ చంద్రబాబు నాయుడుని వేధింపులకు గురి చేశారని అన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ మనసుకు నచ్చిన వారికి ఓటేయాలని నూతన ఓటర్లకు సూచించారు. యువతకు, మహిళలకు అద్భుతమైన పథకాల ద్వారా చేయూతను అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తెలుగుదేశం పార్టీ నినాదమని అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తూన్న జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆరోపించారు.
అనంతరం అనంతరం నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి, జనసైనికులు రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు సైనికులు వలె పనిచేసి టిడిపి విజయానికి కృషి చేయాలన్నారు. My First Vote for CBN ప్రోగ్రాంకు విశేష స్పందన రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యకం చేశాయి. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండయ్య చౌదరి శివరామకృష్ణ కళ్యాణ్ హైమ నాగబాబు సురేష్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist