Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!

Share the news
Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!

Mudragada takes off his Kapu mask

చివరికి కాపు ముసుగు తీసేసి వైసీపీ లోకి చేరబోతున్న ముద్రగడ(Mudragada). సో కాల్డ్ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆయన ఈ నెల 14న వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ముద్రగడతో(Mudragada) పాటు ఆయన కుమారుడు గిరిబాబు సహా పలువురు కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరనున్నారట. కిర్లంపూడి నుంచి అనుచరులతో తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వీరు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల కిర్లంపూడిలోని ముద్రగడను కలిసిన రీజనల్ కోఆర్టినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడతో సమావేశమై ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని.. సీఎం జగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ తెలిపారు.

అంతకు ముందు రాజకీయ పరిణామాల చూసినట్లతే అయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగింది. ఒక విదంగా ఆయన వైసీపీ అనుకూలంగా ఉండేవారు. ఇక ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన భారీ విందు సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. వైసీపీలో చేరుతాననే ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రకటించలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదని.. జనసేనలో చేరుతానని ప్రకటించారు. అనంతరం జనసేన నేతలు ఆయనతో భేటీ ఐన సంగతి తెలిసిందే. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది. అయితే, పవన్ ఇటీవల రాజమండ్రిలో పర్యటించినా ముద్రగడ నివాసానికి వెళ్లలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తి చేశారు. ‘మనం చెప్పాల్సింది చెప్పాం. తర్వాత మనం చేసేది ఏమీ లేదు. వస్తే ఓ నమస్కారం. రాకపోతే రెండు నమస్కారాలు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందన్న ప్రకటన వెలువడగానే.. ఈ అంశంపై ముద్రగడ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందని విమర్శించారు కూడా.

See also  Janasena Flag: ఏపీ లోనే కాదు.. ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై కూడా జనసేన జెండా!

కొసమెరుపు

ఆంతా బాగానే ఉంది. ఆయన ఏ పార్టీలో అయినా చేరవచ్చు అది ఆయన ఇష్టం. కానీ చేరే ముందు ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
జనసేనలోకి చేరాలి అంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆయనింటికి వచ్చి ఆహ్వానించాలన్నారు. మరి ఇప్పుడు జగన్(Jagan) వచ్చి ఆయనను ఆహ్వానించాడా వైసీపీ లోకి చేరమని?
జనసేనలో(Janasena) చేరాలి అంటే కండిషన్లు.. వైసీపీ(YCP) లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి పదవులు ఆశించడం లేదని.. సీఎం జగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పడం దేనికి సంకేతం?
కండీషన్లేమి లేకుండా సేవ చేయడానికి వైసీపీలో చేరడం ఎందుకు? అదేదో జనసేనలో చేరి సేవ చేయవచ్చుగా. పైగా కాపుల్ని ఉద్దరించినట్లుగా కూడా ఉండేది. ఆలా ఎందుకు చేయకలేకపోయారు?
జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే కమ్మను సిఎం చేయడానికి.. మీరిప్పుడు కాపును సీఎం ని చేయడానికా వైసీపీ లోకి చేరుతుంది?
అసలు మీరు వైసీపీ లోకి చేరితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది? వైసీపీ లో చేరి పవన్ కళ్యాణ్ ని పార్టీ పరంగా తిట్టికున్నా పరవాలేదు. ఇలా కోవర్టు పనులు చేసి ఉన్న కొంచెం పరువు తీసుకోవడమెందుకో?
ఇక మీరు వెళ్ళేది మీ కుమారుడు గిరిబాబుకు నామినేటెడ్ పదవి కోసం, దానికి ప్రతిఫలంగా కొన్నికాపు ఓట్లు చీల్చి టీడీపీ + జనసేన ను దెబ్బకొట్టడానికే అని అందరికి తెలిసిన విషయమే. వివిధ పార్టీల్లో ఎమ్మెల్యే గా, ఎంపీ గా, మంత్రిగా పని చేసిన మీరు చిన్న నామినేటెడ్ పదవి కోసం ఇంతలా దిగజారాలా?
ఇలాంటి ప్రశ్నలు కాపు యువతలో చాలా వస్తున్నాయి. సమాధానం ఉంటే పత్రికా ముఖంగా చెప్పండి మరి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top