
ఉప్పు నిప్పుగా కత్తులు దూసుకుంటూ ఉన్న టీడీపీ, బీజేపీ ని కలుపుతా అని పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఎప్పుడో చెప్పారు. ఈ రోజు చేసి చూపించాడు. శత్రువుని ఎప్పటికి క్షమించడు అని పేరు ఉన్న అత్యంత శక్తీవంతమైన అమిత్ షా పై తిరుపతిలో టీడీపీ వాళ్ళు రాళ్లు వేశారు. టీడీపీకి మా తలుపులు శాశ్వతంగా మూసేసాం అంటూ అమిత్ షా అత్యంత కోపంగా స్పందించారు అప్పట్లో.
ఇవ్వాళ అవన్నీ గతం అంటూ మర్చిపోయి చేతులు కలిపారు అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం.. ఆయనే పవన్ కళ్యాణ్. మొన్న ఢిల్లీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తు కోసం ఒకచోట కూర్చుని మాట్లాడుకున్నారు అంటే దానికి పవన్ కళ్యాణ్ యొక్క నిరంతర ప్రయత్నమే కారణం. ఈ ప్రయత్నంలో చాలా మంది చాలా రాళ్లు వేశారు ఆయన మీద. చాలామంది హేళన చేశారు కూడా. అటు మొన్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి నవ్వులుపాలు అవ్వడం కూడా ఈ పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చేసిన ఒక త్యాగం. ఏపీలో బీజేపీ మనకి అండగా రావాలి అంటే ఆ త్యాగం చెయ్యక తప్పలేదు. ఆ ఓటమి చాలా అవమానం మిగిల్చింది. దిగమింగాడు. ఆ రోజు దిగమింగాడు కాబట్టి ఈ రోజు బీజేపీ అగ్ర నాయకత్వం దగ్గర గౌరవం పెరిగింది.
సీట్ల పంపకం ఖరారు.. నిరాశలో జనసైనికులు(Janasainikulu)
ఇక అసలు విషయానికి వస్తే, ఇన్ని చేసిన పవన్ కళ్యాణ్ కి చివరికి దక్కిందేమిటి అనేది జనసైనికుల (Janasainikulu) ప్రశ్న. 24 అసెంబ్లీ సీట్లు అని దానిలో 3 తిరిగి తీసుకున్నారు. అలాగే 3 ఎంపీ సీట్లనుంచి ఒకటి తిరిగి తీసుకున్నారు. పార్టీని ఇలా తగ్గించుకుంటే రేపు 2029 పరిస్థితి ఏమిటి? పార్టీని నమ్ముకుని తిరిగే వాళ్ళ గతి ఏమిటి? డిమాండ్ చేసే పోసిషన్ లో ఉండి కూడా డిమాండ్ చేసి సీట్లు సాధించుకోలేక పోవడమేమిటి? అసలు పొత్తు లేక పోతే 2029 కి టీడీపీ ఉండేది కాదుగా? ఇలా చాలా ప్రశ్నలు Janasainikulu నుంచి, అభిమానుల నుంచి పవన్ కళ్యాణ్, Janasena పార్టీ ఎదుర్కొంటున్నాయి.
కానీ పవన్ కళ్యాణ్ దృష్టి లో పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్రం, దేశము ప్రయోజనాలే ఎక్కువ. జనానికి అది ఎక్కక పోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు చూసిన రాజకీయ పార్టీలు రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగాలు చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చాయి కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యతనిచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ వేరు. అవసరమైతే పార్టీని తగ్గించుకుంటాడు కానీ రాష్ట్రం, దేశము ప్రయోజనాలే ముఖ్యం ఆయనకు.
మరి ఆయన త్యాగాన్ని ప్రజలు గుర్తించి భవిష్యత్తు లో ఆయన్ని అందలం ఎక్కిస్తారా? లేదంటే షరా మామూలుగా గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు, నమ్మించి మోసం చేసే పార్టీలనే ఆదరిస్తారా అనేది ఇప్పుడే చెప్పలేము. ఒకసారి అయన MLA గానో లేదా MP గానో గెలిచి, ప్రజలకు ఏవిదంగా మేలు చేస్తాడో చూస్తే గాని ప్రజలకు క్లారిటీ వచ్చేలా లేదు.