Pawan Kalyan on Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

Pawan Kalyan on Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు.
Share the news

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జమ్ము – కశ్మీర్‌” ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని భారత్ ప్రజలందరు కలలుగన్నారు. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మరో విజయంగా జనసేన భావిస్తోందని అన్నారు. దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొనే మధుర క్షణాలు ఇవి. భారత ప్రభుత్వం Article 370 రద్దు చేస్తూ చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సమర్ధించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల జనసేన హర్షాతిరేకం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా ఈ రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ధ్రువీకరించింది. ఈ నిర్ణయం దేశ సమగ్ర ఐక్యత, పురోగతికి ఒక ముఖ్యమైన పరిణామం. అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ సాధించిన విజయంగా దీనిని జనసేన పరిగణిస్తోంది’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

See also  Janasainiks Fight over Poor Sanitation: పడకేసిన పారిశుధ్యంపై రేపల్లె జనసైనికుల పోరు

Also Read News

Scroll to Top