
AP ECET 2024
AP ECET 2024 Notification: ఏపీ లోని ఇంజినీరింగ్(Engineering) కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ మార్చి 14న విడుదలైంది. ఇక ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసెట్ ప్రవేశ పరీక్ష ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ(JNTUA) అనంతపురం ఈ ఏడాది ECET పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టింది. యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పి. ఆర్. భానుమూర్తి ECET కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
అందుబాటులో ఉన్న కోర్సులు: బీటెక్, బీఫార్మసీ.
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (Diploma in Engineering), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు గాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు…
నోటిఫికేషన్ వెల్లడి: 14.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.
రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.04.2024.
రూ.2000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.04.2024.
రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2024.
దరఖాస్తుల సవరణకు అవకాశం: 25.04.2024 – 27.04.2024.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 01.05.2024.
పరీక్ష తేది: 08.05.2024.
పరీక్షసమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.2.30 గం.-సా.5.30 గం. వరకు.
ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల: 10.05.2024.
ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 12.05.2024 వరకు.