![TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..](https://samacharnow.in/wp-content/uploads/2024/03/tstet-2024.webp)
TSTET 2024 వివరాలు
తెలంగాణ (Telangana) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET 2024) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా శాఖ మార్చి 14న విడుదల చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని విద్యా శాఖ సూచించింది. పరీక్షలు మే 20 నుండి జూన్ 3 వరకు నిర్వహించబడతాయి. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. తెలంగాణ డీఎస్సీ 2024(Telangana DSC 2024) కి ముందు టెట్ పరీక్ష నిర్వహించబడుతుంది.
Important Dates
TET 2024 నోటిఫికేషన్ విడుదల | 14.03.2024 |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 27.03.2024 |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | 10.04.2024 |
TET 2024 పరీక్ష | 20.05.2024 – 03.06.2024 |
ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరియు వివరణాత్మక నోటిఫికేషన్‌ను 20 మార్చి, 2024 నుండి https://schooledu.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఇది కూడా చదవండి : Telangana DSC 2024