MLC Kavitha: MLC కవిత నివాసంలో ED, IT జాయింట్ సోదాలు.. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు

BRS Leader MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢీల్లీ లిక్కర్ స్కాం కేసు లో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది
Share the news
MLC Kavitha: MLC కవిత నివాసంలో ED, IT జాయింట్ సోదాలు.. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు

MLC Kavitha నివాసంలో ED, IT జాయింట్ సోదాలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) షాక్ తగిలింది. Hyderabad బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం, 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తోంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు అని తెలుస్తోంది. ఈ క్రమంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో MLC Kavitha నిందితురాలు అన్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతుంది. ఇప్పడు ఈ సోదాలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించినవేనని తెలుస్తోంది. ఈ సోదాలు రేపటి వరకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆవిడకు సంబంధించిన లాయర్లు సుప్రీమ్ కోర్టులో కేసు గురించి ఢిల్లీ లో ఉన్నట్లు తెలుస్తుంది. రాత్రికి వాళ్ళు హైదరాబాద్ చేరుకొనే అవకాశం వుంది.

See also  Bapatla MLA Seat: బాపట్ల ఎమ్మెల్యే టికెట్ రేసులో రిటైర్డ్ ACP!

మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థల ముందు ఆమె విచారణకు హాజరవ్వాలా.. వద్దా.. అనే దానిపై ఆ రోజు విచారణ జరగనుంది.

Also Read News

Scroll to Top