CBN Goes To Pawan Kalyan House: ఏమి జరగుతోంది? AP రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ !

Share the news
CBN Goes To Pawan Kalyan House: ఏమి జరగుతోంది? AP రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ !

CBN Goes To Pawan Kalyan House

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టోను ఖరారు చేయడం, సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలోని అవకతవకలను పరిష్కరించడంపై వారు దృష్టి సారించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. దాదాపు మరల 10 సంవత్సరాల తరువాత ఇప్పుడే.

టీడీపీ మహానాడు లో ప్రకటించిన మినీ మానిఫెస్టోకు మరికొన్ని అంశాలు చేర్చాలని జనసేన ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా యువత, మహిళలు , SC , ST లకు సంబందించిన అంశాలను సూచించినట్లు సమాచారం. బాబు, పవన్ ఫొటోలతో వున్న ఉమ్మడి మేనిఫెస్టోను ముద్రించి ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు పై కూడా త్వరలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది

See also  AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం

ఏది ఏమైనా టీడీపీ, జనసేన యొక్క బలం గుర్తించి.. పొత్తులో సరైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఒక గౌరవ ప్రదమైన పొత్తు కుదరడానికి గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తున్నారనిపిస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top