
సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar) సంచలన లేఖ!!
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar), ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన సందర్భంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కు లేఖ రాశారు, అందులో “సత్యం గెలిచింది” మరియు ఆమె “కర్మ ఫలాలు అనుభవిస్తుంది” అని పేర్కొన్నాడు.
మార్చి 18 (సోమవారం) నాటి లేఖలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) కుమార్తె కె.కవితను ‘అక్క’ అని సంబోదించాడు. “నిజం గెలిచింది, ఇంతకాలం తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిందని, చేసిన పనులు కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని” సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో వెల్లడించాడు. ఆమె ఇప్పుడు “సత్యం యొక్క శక్తిని ఎదుర్కోవలసి ఉంటుంది” అని కూడా అతను చెప్పాడు. “మీరు ఎప్పుడూ మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరని భావించారు … కానీ మీరు కొత్త భారత్ లో చట్టం గతంలో కంటే బలమైనదని మరియు శక్తివంతమైనదని మరిచి పోయారు.”
Also Read: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి!
తాను గతంలో రాసిన లేఖలలో రెండు అంశాలను చెప్పినట్లు పేర్కొన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar), ఒకటి: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని, రెండవది: తీహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంటర్ మొదలైందని చెప్పానని.. ఈ రెండు ఇప్పుడు జరిగినట్లుగా అనిపిస్తున్నాయి అని అన్నాడు.
కె కవిత(K.Kavitha) అరెస్ట్ తో ఇప్పుడు “అవినీతి పండోరా బాక్స్” తెరవబడ్తుంది అని సుఖేష్ అన్నాడు. “అవినీతి రారాజు, నా ప్రియమైన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తో సహా మీ అవినీతి సహచరులందరు చేసిన అక్రమాలు బట్టబయలు కాబోతున్నాయి. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు ఈడీ విచారణలో బయటికొస్తాయి.” ఇది ఎవరికి అర్థంకావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
“మీ అవినీతి అంతా నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి.. అక్కా, త్వరలో ముఖాముఖి కలుద్దాం. నేను మిమ్మల్ని తీహార్ క్లబ్‌కు స్వాగతిస్తున్నాను, ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే.. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ” అంటూ సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar) కవితకు సూచించాడు.