Ram Charan RC 16 Pooja Ceremony: పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ RC 16!

Share the news
Ram Charan RC 16 Pooja Ceremony: పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ RC 16!

రామ్ చరణ్ RC 16 Pooja Ceremony

RC16 Pooja Ceremony: RRR సినిమాతో గ్లోబల్ స్టార్ డమ్ తెచ్చుకున్న రామ్ చరణ్ RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో తుఫాన్ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం లో తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

రామ్ చరణ్ బర్త్ డే దగ్గరలో ఉండటంతో RC 16 అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఊహించారు. దానికి తగ్గట్టు గానే ఈ రోజు (మార్చి 20) ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమంతో ప్రారంభించారు మేకర్స్. #RC16 పూజా వేడుక రేపు ఉదయం 10.10 గంటలకు జరిగినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ వేదికగా ఓ ప్రైవేట్ హోటల్ లో RC 16 పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. చిరంజీవి, అల్లు అరవింద్, ఇంకా దర్శకుడు సుకుమార్(Sukumar), Game Changer దర్శకుడు శంకర్(Shankar) హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.

See also  Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?

ఇక కాస్టింగ్ అండ్ క్రూ విషయానికి వస్తే ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) డైరెక్షన్ లో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. టాప్ స్టార్ కాస్టింగ్ తో పాటుగా టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(A R Rahman) ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు(Rathnavelu) సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యహరిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) బ్యానర్‌లపై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ‘RC 16’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఉత్తరాంధ్రలోని రామభద్రపురం నేపథ్యంలో ఈ రూరల్ డ్రామా కథంతా నడుస్తుంది. ఇందులో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. పుట్టిన రోజు స్పెషల్ గా మార్చి 27న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశాలు వున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top