Janasena Kakinada MP Candidate? చాయ్ వాలా పీఎం అయినప్పుడు.. టీ టైం ఓనర్ టీ గ్లాస్ గుర్తు పై ఎంపీ అవలేడా?

Share the news
Janasena Kakinada MP Candidate? చాయ్ వాలా పీఎం అయినప్పుడు.. టీ టైం ఓనర్ టీ గ్లాస్ గుర్తు పై ఎంపీ అవలేడా?

Janasena Kakinada MP Candidate తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎవరు?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిన్న జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిని(Janasena Kakinada MP Candidate) ప్రకటించడం తెలిసిందే. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Tangella Uday Srinivas) కాకినాడ పార్లమెంటు స్థానంలో జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడని అని తెలియగానే ఎవరీ ఉదయ్ శ్రీనివాస్? అంటూ అందరిలోనూ చర్చ మొదలైంది. జనం ఆరా తీయడం మొదలు పెట్టారు. కాకినాడ చాలా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. పైగా బ‌ల‌మైన కాపు సామాజిక వర్గం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. మ‌రి అలాంటి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు పేరు కూడా పెద్ద‌గా తెలియ‌ని ఉద‌య్ శ్రీనివాస్ అనే యువ‌కుడికి ఇవ్వ‌డం ఏంటి? అనే చ‌ర్చ సాధార‌ణ‌మే.

అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి విశేషాలు చూస్తే మనోడు సామాన్యుడు కాదు అనే రేంజిలో ఉన్నాయి. దుబాయ్ లో కళ్లు చెదిరే జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి, భారత్ వచ్చి టీ టైమ్(Tea Time) పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించి, కోట్ల రూపాయల టర్నోవర్ తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు.

See also  TS Inter Hall Tickets 2024: ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల..

ఉదయ్ 2006లో హైదరాబాదులోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్న తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. చివరిగా దుబాయ్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా… ఇలా అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు.

అయితే, 29 ఏళ్ల వయసులో సొంతంగా ఏదైనా సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చేసాడు. భారత్ వచ్చిన అనంతరం టీ టైమ్ పేరిట దేశవ్యాప్త గొలుసుకట్టు టీ దుకాణాలతో కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఉదయ్ కు సపోర్ట్ గా నిలిచింది భార్య బకుల్. ఆమె ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ అని తెలుస్తుంది. టీ టైమ్ వ్యాపారం బాగా సాగడంతో ఉదయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 2016లో రూ.5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా… ఇప్పుడు టీ టైమ్ ఫ్రాంచైజీల సంఖ్య 3 వేలకు పెరిగింది. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరిందంటే అతను ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది.

See also  APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి!

Janasena Kakinada MP Candidate గా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎలా ఎన్నుకోబడ్డాడు?

రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తితో ఉదయ్ శ్రీనివాస్ ఏపీ వైపు దృష్టి సారించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన(Janasena) అని గుర్తించాడు. దానితో పాటు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరాడు. 2019 నుంచి ఉద‌య్.. ప‌వ‌న్ తో క‌లిసి తిరుగుతున్నాడు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. వారాహి ప్ర‌చారం రధం కొనిచ్చింది.. రిజిస్ట్రేష‌న్ చేయించింది కూడా ఉద‌యే అని తెలుస్తుంది. అందుకే వారాహి యాత్ర తొలి సారి పిఠాపురంలో నిర్వ‌హించారు. దీనికి కూడా కార‌ణం ఉంది. మొదట పిఠాపురం(Pithapuram) నుంచి ఉద‌య్‌ను బ‌రిలో నిల‌పాల‌ని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండంతో ఉదయ్ ని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అని ఆలోచించారు. ఉదయ్ ఐదేళ్లకు పైగా జ‌న‌సేన‌ కోసం పని చేస్తుండడంతో ఆయనను నిరుత్సాహ ప‌ర‌చ‌కుండా కాకినాడ ఎంపీగా(Janasena Kakinada MP Candidate) పోటీ చేసే అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్. ఆర్థికంగా బ‌లం ఉన్న వ్య‌క్తి కావ‌డంతో ఇబ్బంది లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top