Civil Service Officers Failure: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సివిల్ సర్వీస్ అధికారులు రాణించడం లేదెందుకని?

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి సివిల్ సర్వీస్ అధికారులు వస్తున్నారు కానీ చాలామంది సివిల్ సర్వీస్ అధికారులు విఫలమవుతున్నారు(Civil Service Officers Failure). ఈ పరిస్థితి కారణం ఏమిటి ?
Share the news
Civil Service Officers Failure: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సివిల్ సర్వీస్ అధికారులు రాణించడం లేదెందుకని?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో Civil Service Officers Failure

సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లో విఫలమవడానికి(Civil Service Officers Failure) కారమణమేమిటి? రాజకీయాల్లోకి వస్తున్నారు.. కొంత మంది సొంత పార్టీలు పెడుతున్నారు. మరికొంత మంది ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరల బయటికి వచ్చి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. అయితే ఎవరూ పెద్దగా నిలదొక్కుకుంటున్న సందర్భాలు లేవు. అతి తక్కువ మంది మాత్రమే రాణిస్తున్నారు. మిగిలిన వారు ఒకటి, రెండు ఎన్నికల తర్వాత కనుమరుగౌతున్నారు. సివిల్ సర్వీస్ అధికారులు సర్వీస్‌లో తాము ఎంత పవర్ ఫుల్ గా ఉన్న రాజకీయ నేతగా వచ్చేసరికి పార్టీ అధినేత ముందు డమ్మీగా ఉండాల్సి వస్తోంది. ఇక సొంత పార్టీలు పెట్టుకున్న వారు అయితే ప్రజాప్రతినిధి కావడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది.

బీఎస్పీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని విఫలమై, బీఆర్ఎస్‌లో చేరిపోయిన ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ఐపీఎస్ గురించి తెలిసిందే ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గా మంచి పేరు సంపాదించు కున్నారు కానీ రాజకీయంగా పెద్దగా రాణించలేదు. ఇక ఆయన రాజకీయ జీవితంలో దళితులు, దళితోద్దరణ, బహుజన వాదమనే- ఓ అంకం ముగిసింది. ఎవర్నైతే దొర, దొరబిడ్డ, గడి, గడిపాలనని దుమ్మెత్తి పోశారో అదే పార్టీ.. బీఆర్ఎస్ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ని నమ్మి, బీఆర్ఎస్(BRS) లో చేరుతున్నానని సగర్వంగా చెప్పారు, ఆయనలా మడం తిప్పనన్నారు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినా తిరస్కరించి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రవీణ్ కుమార్ చెప్పారు. డబ్బు, పదవికి అమ్ముడుపోయే వ్యక్తి ప్రవీణ్ కాదన్నారు. బహుజన వాదం కోసం పని చేసే వ్యక్తినేనన్నారు. చాలా వాటిలో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల్ని ప్రమోట్ చేశారు. అయితే అధికారిగా ఆయనను ఆదరించిన ప్రజలు రాజకీయ నేతగా మాత్రం పట్టించుకోలేదు.

See also  AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

ఇక జేపీ, జేడీ ల విషయానికి వస్తే, రాజకీయంగా ఇద్దరూ ఫెయిలే ! అప్పుడెప్పుడో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీని ఏర్పాటు చేసి, దాని ఫెయిల్యూర్ తరువాత ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇక సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఒకప్పుడు అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన జేడీ లక్ష్మీనారాయణ సొంతపార్టీ పెట్టి ఆపసోపాలు పడుతున్నారు. అంతకు ముందు ఆయన జనసేన లో కొంత కాలం పనిచేసి 2019 లో విశాఖ ఎంపీ గా పోటీ చేసి 2.8 లక్షల పైచిలుకు ఓట్లు సంపాదించి 3 వ స్తానంలో నిలిచారు. ఆయన అలా జనసేన లో కొనసాగిన ఈసారి ఎంపీ గా గెలిచేవారు. కానీ ఒక సిల్లీ రీజన్ తో పార్టీకి రిజైన్ చేసి ఈ మద్యే కొత్త పార్టీ పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మరో ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ దళిత ఉద్దరణ పేరిట కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. కానీ వీరు కనీస ఫలితాలు సాధిస్తారని ఎవరూ అనుకోవడంలేదు.

See also  BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన!

ఇక మన సివిల్ సర్వీస్ అధికారులు ఎందుకు ఫెయిల్(Civil Service Officers Failure) అవుతున్నారంటే

సివిల్ సర్వెంట్లు చాలా ఆలస్యంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాతే రాజకీయపార్టీల దరి చేరతారు. రాజకీయాల్లో అంత సీనియారిటీ ఉండదు. ఇతర రాజకీయ నాయకులు పార్టీలలోనే పుట్టి పార్టీల్లోనే పెరుగుతారు. సో వాళ్ళే పార్టీల్లో సీనియర్స్ లా వుంటారు. ఇక ఇలా పదవీ విరమణ తరువాత పార్టీల్లో చేరిన అధికారులు, రాజకీయాల్లో సీనియర్లు అయినా వయసులో తమ కన్నా చిన్న వాళ్ళ కింద పని చేయాలి అంటే అహం అడ్డు వస్తుంది. ఇంకోటి వీళ్ళు సాధారణ జనంతో కలిసి మెలిసి తిరగలేరు.

ఒక రంగం లో టాప్ లో వున్న వారు మరో రంగం లోకి వెళ్ళినప్పుడు కొంత వరకు గుర్తింపు ఉంటుంది కానీ వేరే రంగం లోని మెళుకువలు మొదటి నుంచి నేర్చుకుంటేనే కొత్త రంగంలో రాణించ గలరు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తీసుకున్నట్లతే ఆయన ఇదే పద్దతి అనుసరిస్తున్నారు. ఇక కొన్ని అసాధారణమైన కేసులు కూడా ఉంటాయి. ఎన్టీఆర్ లాంటివాళ్లు పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ప్రభుత్వం స్థాపించారు. ఒక విదంగా అప్పుడు కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత, పొలిటికల్ గ్యాప్ కూడా ఆయన రాణించడానికి ఒక కారణం.

See also  OU Distance Education: దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ జారీ చేసిన PGRRCDE

ఇక మన సివిల్ సర్వీస్ అధికారులు ప్రస్తుతం విఫలమైన(Civil Service Officers Failure), సరైన పార్టీలో కొనసాగితే మాత్రం రాణించడం ఖాయం. ఇకపోతే సివిల్ సర్వెంట్లకు తాము మంత్రులుగా ఏమి చేయగలరో తెలుసు గాని ఎలా ఓట్లు సాధించాలో తెలియదని రాజకీయ నిపుణులు అంటుంటారు. సీజన్డ్ పొలిటిషయన్ గా మారాలంటే, ఇగో వదిలేసి ఓపిగ్గా రాజకీయ మెళుకువలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే సివిల్ సర్వీస్ అధికారులు ఫెయిల్యూర్స్(Civil Service Officers Failure) తగ్గుతాయి

Also Read News

Scroll to Top