
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సాయంత్రం ఆయన నివాసం నుంచి అరెస్టు చేసింది. అరెస్టు తర్వాత, కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు, రాత్రికి అయన ED కార్యాలయం లో బస చేశారు.
మద్యం పాలసీ(Delhi Liquor Policy Case) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు సంబంధించి ఆప్ అధినేతకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉపశమనం నిరాకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ తొమ్మిది సమన్లు జారీ చేసింది, అయితే ఆయన దానికి నిరాకరించారు.
కోర్టు విచారణ ముగిసిన కొద్దిసేపటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం కేజ్రీవాల్ సివిల్ లైన్స్ నివాసానికి చేరుకుంది. విచారణ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్‌లను కూడా అధికారులు ఎత్తుకెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్ నాయకులు మరియు మద్దతుదారులు నిరసనకు గుమిగూడడంతో ముఖ్యమంత్రి నివాసం వెలుపల భారీ పోలీసు మోహరింపు మరియు బారికేడింగ్‌లు ఉన్నాయి. తన ఇంటి బయట నిరసన తెలుపుతున్న ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు పూర్తి చేసిన తర్వాత కేజ్రీవాల్‌ను కారులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తరలించారు. ఇక ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి.
కొద్దిసేపటికే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును రద్దు చేయాలని కోరుతూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. “మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము మరియు ఈ రాత్రి అత్యవసర విచారణ కోసం అభ్యర్ధించాం” అని ఆప్(AAP) మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్‌ను శుక్రవారం ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరుస్తామని, విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతనిని కస్టడీకి కోరుతుందని అధికారులు తెలిపారు.
ఇక ఆప్ మంత్రి అతిషి మాటాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ “ఉంటారు మరియు కొనసాగుతారు” అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని.. ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మేం ఎప్పటినుండో చెబుతున్నామని.. సుప్రీంకోర్టులో కేసు వేశామని.. మా లాయర్లు సుప్రీంకోర్టుకు చేరుకుంటున్నారని అతిషి మీడియాతో అన్నారు.జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకుండా కేజ్రీవాల్‌ను ఏ నియమం అడ్డుకోలేదని కూడా ఆమె అన్నారు.
కొసమెరుపు: ఇన్ని రోజులు జైలులో ఉండి MLA, MP లగా పోటీ చేయడం చూసాం. 16 నెలలు జైలులో వుండి తరువాత సీఎం అవడం చూసాం. ఇక ఇప్పుడు జైలు నుంచి ఒక సీఎం పరిపాలన చూడబోతున్నాం. That is the beauty of our Democracy . దీన్ని బట్టి పోలీస్ కేసులు ఉంటే ఉద్యోగాలకి, ఇంకా వేరే వాటికి పనికి రారు, కానీ దర్జాగా రాజకేయాల్లో చేరిపోవచ్చు.