
టీడీపీ(TDP) తరపున రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్(CM Ramesh) ఆ తరువాత బీజేపీలో చేరిన విషయం తెలిసినదే. ఇక ఆయన రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెలలో పూర్తవుతుంది. మరోసారి ఎంపీగా ఎన్నికవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయనకి వెలుగులోకి వచ్చిన ఎన్నికల బాండ్ల వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.
సీఎం రమేష్ స్వతహాగా బిజినెస్ మాన్. ఆయనకు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గర బంధువులు ఈ కంపెనీని చూసుకుంటున్నారు. ఇటీవల ఆయన కుమారుడు కూడా కీలక బాధ్యతల్లోకి వచ్చాడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన కూడా బిజినెస్ అవసరాల దృష్ట్యా సీఎం రమేష్ బీజేపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవారని చెబతూంటారు.
బీజేపీ ఎంపీ CM Ramesh నుంచి కాంగ్రెస్(Congress)కు రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు!
ఇక అసలు విషయానికి వస్తే బీజేపీ ఎంపీలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి విరాళం ఇవ్వడం చూస్తామా ?. కానీ సీఎం రమేష్(CM Ramesh) ఇచ్చాడు. అది కూడా భారీ విరాళం. ఆయనకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు . వాటిని కాంగ్రెస్ ఎన్ క్యాష్ చేసుకుంది కూడా. అలాగే మరో కర్ణాటక పార్టీ అయిన జేడీఎస్ కు కూడా పది కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.
సీఎ రమేష్ ఎంత వ్యాపారవేత్త. అయినా కూడా తన ప్రత్యర్థి పార్టీకి వివరాళివ్వడం ఆశ్చర్యకరం. బీజేపీ(BJP)లో ఇది చర్చనీయాంశంమైంది. ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బాండ్ల వివరాలు బయటకు రావడంతో ఆయన కు టిక్కెట్ ఇవ్వడంపై పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కొసమెరుపు: వ్యాపారవేత్తలకు ఎప్పుడైనా బిజినెస్ ఫస్ట్! వాళ్ళు రాజకీయల్లో వున్న సరే. వాళ్ళ వ్యాపారానికి ఎవరు ఉపయోగ పడతారో వాళ్లకి విరాళాలు ఇవ్వడం మామూలే. ఒకవేళ బీజేపీ కర్ణాటక లో అధికారంలోకి తిరిగి వస్తే తన వ్యాపారాలకు సమస్యే లేదు. అలా కాకుండా కాంగ్రెస్ వస్తే ఏమిటి అనే ఆలోచన చేసి ముందుచూపుతో కాంగ్రెస్ కు విరాళాలు ఇచ్చాడు, తప్పేమి ఉంది? కాకపోతే ఇలాంటి రాజకీయ నాయకుల వలన ప్రజలకేమి ఉపయోగమో మీరే ఆలోచించుకోవాలి.