Siddharth and Aditi Secrete Marriage: సినీ ఫక్కీలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల పెళ్ళి

Share the news
Siddharth and Aditi Secrete Marriage: సినీ ఫక్కీలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల పెళ్ళి

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల Secrete Marriage

వనపర్తి: సినీ హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితి రావు హైదరీ(Aditi Rao) రెండవ వివాహం చేసుకున్నారు. గతంలో తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకొన్న వీరిద్దరూ ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారి కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు.

నిన్న (మార్చి 27వ తేదీన) వీరిద్దరూ వనపర్తి జిల్లాలో పెబ్బేరు మండలంలోని అదితి రావు వారసత్వంగా ఉన్న (అదితిరావు తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి చివరి రాజు రామేశ్వరరావు కూతురు) శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి గురించి వార్తలు బయటకు పొక్కకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని రహస్యంగా పెళ్లి(Secrete Marriage) చేసుకున్నారు.

శ్రీరంగనాయక ఆలయంలోని పూజారులకు “సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా కోసం పెళ్లి సెట్ వేసి వివాహ సన్నివేశాలను చిత్రీకరిస్తాం. మీరు ఈ షూట్కు దూరంగా ఉండాలి” అని సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ సమయంలో తమిళనాడుకు చెందిన బ్రహ్మణులు ఆలయంలోకి ప్రవేశించి నిజమైన పెళ్లి చేశారు.

See also  SPF Constable Suicide: విశాఖలో తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top