
Akhila Priya Arrest
నంద్యాల: టీడీపీ(TDP) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జగన్(Jagan) చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఇవాళ నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో సాగునీటి విడుదల కోసం సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అఖిల ప్రియతో పాటు టీడీపీ శ్రేణులు వైసీపీ సభ దగ్గరకు భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు.
-By VVA Prasad