April Fools Day: ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ గా ఎందుకు జరుపుకుంటారు..?

భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే (April Fools Day)19వ శతాబ్దంలో అంటే బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది
Share the news
April Fools Day: ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ గా ఎందుకు జరుపుకుంటారు..?

‘ఫూల్స్ డే’ అంటే ఏప్రిల్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత. దీని బాధితులని ‘ఏప్రిల్ ఫూల్స్’ గా వ్యవహరించడం పరిపాటి. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ‘ఏప్రిల్ ఫూల్’ జరుపుకుంటారు.

నవ్వులు, జోకులతో నిండిన ఈ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ సరదాగా ఉంటుంది. ఈ రోజున ప్రజలు తమ కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులను ఏదో ఒక విధంగా ఏప్రిల్ ఫూల్ చేయడంలో బిజీగా ఉంటారు.

ఏప్రిల్ ఫూల్స్ డే(April Fools Day) ఎప్పుడు ప్రారంభమైంది ?

నిజానికి, ఏప్రిల్ ఫూల్స్ డే(April Fools Day) వేడుక ఫ్రాన్స్‌ ( France )లో 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. అయితే 1582లో, ఫ్రెంచ్ రాజు జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ చాలా మంది ప్రజలు ఈ మార్పును అర్థం చేసుకోలేదు, అలాగే అంగీకరించలేదు. ఏప్రిల్ 1న నూతన సంవత్సర వేడుకలను కొనసాగించారు. అలాంటి వారిని ‘ఏప్రిల్ ఫూల్స్’ అని ఎగతాళి చేసేవారు

See also  EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై 'అవమానకరమైన' వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం!

ఏప్రిల్ 1న ‘ఫూల్స్ డే’ సంప్రదాయం వెనుక కథ..
ఏప్రిల్ 1న రోమన్లు ‘హిలేరియా’ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో ఒకరినొకరు హేళన చేసుకునేవారు. హిలేరియా (Hilaria) అంటే ‘ఉల్లాసంగా లేదా ఆనందంగా’ అని అర్థం.

భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే(April Fools Day) ప్రారంభమైంది?
భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే 19వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో భారత దేశాన్ని బ్రిటిష్ వారు పాలించారు. అలాగే వారి సంస్కృతిని కూడా ఇక్కడ విస్తరించారు. ఆ సంప్రదాయాలలో ఏప్రిల్ ఫూల్స్ డే(April Fools Day) కూడా ఒకటి.

-By VVA Prasad

Also Read News

Scroll to Top