Byjus Delayed Salaries: వరుసగా రెండో నెలా జీతాలు ఆలస్యం చేసిన బైజూస్!

వరుసగా మార్చి నెలలో కూడా ఉద్యోగులకు జీతాలను ఇవ్వడంలో కొంత జాప్యం(Byjus Delayed Salaries) జరుగుతుందని చెప్పడానికి బాధపడుతున్నామని బైజూస్ కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొంది.
Share the news
Byjus Delayed Salaries: వరుసగా రెండో నెలా జీతాలు ఆలస్యం చేసిన బైజూస్!

Byjus Delayed Salaries

వరుసగా మార్చి నెలలో కూడా ఉద్యోగులకు జీతాలను ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుందని చెప్పడానికి బాధపడుతున్నామని బైజూస్ కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 8 నాటికి జీతాలు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బైజూస్ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.

ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలను సైతం ఉద్యోగులకు కంపెనీ మార్చి మధ్య వరకు ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత బకాయిల్లో కొంత భాగాన్ని చెల్లించింది.

కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి చివర్లో రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ఉపయోగించకుండా నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని కంపెనీ లేఖలో వివరణ ఇచ్చింది.

-By VVA Prasad

See also  My First Vote for CBN కు విశేష స్పందన.. నూతన ఓటర్లలో ఉత్సాహం నింపిన అనగాని!

Also Read News

Scroll to Top