Pensions Distribution: పెన్షన్ల పంపిణీ పై వైసీపీ రాజకీయం చేస్తుంది -టిడిపి ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు

వాలంటరీలతోను రాజకీయమా? జగన్ వ్యాఖ్యలతోనే వాలంటరీలు విధులకు దూరం. పెన్షన్ల పంపిణీ(Pensions Distribution) పై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తుందన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు.
Share the news
Pensions Distribution: పెన్షన్ల పంపిణీ పై వైసీపీ రాజకీయం చేస్తుంది -టిడిపి  ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు

Pensions Distribution పై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం

రేపల్లె(Repalle), బాపట్ల జిల్లా :పెన్షన్ల పంపిణీ(Pensions Distribution) పై వైసీపీ(YCP) దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తుందని టిడిపి(TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు(Gudapati Srinivasa Rao) విమర్శించారు.

స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన(Janasena), బిజెపి(BJP) సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవ్వ తాతలకు సకాలంలో పింఛన్లు అందించటం(Pensions Distribution) చేతకాక వైసిపి నాయకులు వాలంటరీ లను అడ్డం పెట్టుకొని రాజకీయ క్రీడకు తెర లేపారని అన్నారు. ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు తమ సొంత గుత్తేదారులైన కాంట్రాక్టర్లకు ఎన్నికల నిబంధనలను పాటించకుండా దోచిపెట్టి, పెన్షన్ పొందే అవ్వ తాతలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వాలంటరీలు తమ పార్టీ సొంత కార్యకర్తలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఎన్నికల కమిషన్ వారిని విధుల నుంచి దూరంగా ఉంచిందని తెలిపారు. టిడిపి జనసేన ఫిర్యాదుల మేరకు వాలంటీర్లను విధుల నుంచి తప్పించారని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.

See also  Ongole MP Seat: ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

మార్చి చివరలో వచ్చిన వరుస సెలవుల కారణంగా పింఛన్లను మూడో తారీఖున పంపిణీ చేస్తున్నట్టు జగన్ మీడియాలో ఈనెల 28వ తేదీన ప్రచారం చేశారని గుర్తు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అవ్వ తాతల పెన్షన్ ఒకటో తారీకు అందేలా చర్యలు తీసుకోవాలని మార్చి 31వ తేదీన సందేశం పంపారని తెలిపారు. సకాలంలో పెన్షన్లు ఇవ్వడం చేతగాక వైసిపి నాయకులు టిడిపి పై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసి రూ .16 లక్షల కోట్ల అప్పులో ముంచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడిందని తెలిపారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.

జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మత్తి భాస్కరరావు మాట్లాడుతూ పింఛన్లు పంపిణీ చేయడానికి సచివాలయ ఉద్యోగులతో ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ పాలల్లో పేదలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు దోపిడి తప్ప నీతి నిజాయితీలు లేవని అన్నారు. రానున్న ఎన్నికల్లో అవినీతి పాలనకు బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం అవ్వ తాతల పింఛన్లను రేపటిలోగా అందజేయాలని మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.

See also  AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పంతాన్ని మురళీధర్ రావు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, తాతా ఏడుకొండలు, టిడిపి పట్టణ అధ్యక్షులు గోగినేని రామారావు, వెనిగళ్ళ శివ సుబ్రహ్మణ్యం, మేక రామకృష్ణ, అన్నం సాయి, గోపరాజు ఉదయ కృష్ణ, దుళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top