Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని!

సిద్దు జొన్నలగడ్డ సినిమా 'టిల్లు స్క్వేర్'(Tillu Square) ఐదు రోజులకు గాను రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాడు ఈ వీకెండ్ కి వందకోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయం.
Share the news
Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని!

100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి Tillu Square

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈరోజుకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. సిద్దు జోనల్లగడ్డ ప్రేక్షకులని ‘డీజీ టిల్లు’ తో రెండు సంవత్సరాల క్రితం అలరిస్తే ఈసారి ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ ‘టిల్లు స్క్వేర్’ మొదటి సినిమా కన్నా ఎక్కువ వినోదం ఇవ్వటమే కాకుండా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాకి ఎన్నో రేట్లు కాసులు కురిపిస్తుంది కూడా.

ఈరోజు ఈ చిత్ర నిర్వాహకులు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఐదు రోజులకు గాను ‘టిల్లు స్క్వేర్’ రూ.85 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే వారాంతానికి ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరిపోతుంది. సిద్దు జొన్నలగడ్డ లాంటి చిన్న నటుడి సినిమా ఇలా వందకోట్ల క్లబ్బులోకి ఇంత తొందరగా చేరడం నిజంగా పరిశ్రమలో అందరికీ ఆశ్చర్యమే. కానీ సినిమాలో విషయం ఉండాలి గానీ, తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరధం పడతారు అనేదానికి ఈ సినిమా మరొక ఉదాహరణగా చెప్పొచ్చు.

See also  TS BJP: 6 MP స్థానాలకు బీజేపీ అభ్యర్థులు.. తెలంగాణా లో త్వరగా.. మరి ఆంధ్రా లో ఆలస్యమెందుకో?

ఇక ఈ సినిమా విడుదలైన రోజు చిత్ర నిర్మాత వంశీ ఈ సినిమా వందకోట్లు చేస్తుందని అనుకుంటున్నాం అని చెప్పారు. అయితే అది మాటవరసకు అన్నారు అనుకున్నారందరు. కానీ ఇప్పుడు ఆ సినిమాకి వస్తున్న వసూళ్లను చూస్తుంటే రూ. వందకోట్లు దగ్గర ఆగిపోయే సినిమాకాదు, ఇంకా ఎక్కువ చేస్తుంది అనిపిస్తోంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Also Read News

Scroll to Top