
రైల్వేకోడూర్ జనసేన అభ్యర్థి గా Arava Sridhar
రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్(Arava Sridhar) పేరును ఖరారు చేసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan). రైల్వే కోడూరు(Railway Koduru) స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడం మరియు యనమల భాస్కర్ రావు వైసీపీ ముఖ్య నేతలకు సన్నిహితమైన వ్యక్తి అని ప్రచారం జరగడంతో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను పరిశీలించిన తరువాత ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: అవనిగడ్డ అభ్యర్థిగా బుద్దప్రసాద్.. రైల్వేకోడూర్ అభ్యర్థి మార్పు!
ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజక వర్గ జనసేన, తెలుగుదేశం నాయుకులు కలసి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు జనసేన ప్రకటించింది. అరవ శ్రీధర్ మూడు రోజుల కిందటే జనసేన పార్టీలో చేరారు. రైల్వే కోడూరు నియోజక వర్గం ముక్కావారిపల్లె గ్రామ స్పంచ్‌గా ఉన్నారు. ఆయన టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డి స్వగ్రామానికి చెందిన వారు. దాంతో ఆయన సిఫారసుతోనే టిక్కెట్ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది.
రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ అరవ శ్రీధర్#VoteForGlass pic.twitter.com/Gvd5tZbJOa
— JanaSena Party (@JanaSenaParty) April 4, 2024