Brave Forest Officer: కశ్మీర్లో ఖాళీ చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ అధికారి! వీడియో చూడండి!

Share the news
Brave Forest Officer: కశ్మీర్లో ఖాళీ చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ అధికారి! వీడియో చూడండి!

ఖాళీ చేతులతో చిరుతను ఎదుర్కొన్న Brave Forest Officer!

కశ్మీర్: కశ్మీర్లోని(Kashmir) గందర్‌బాల్ జిల్లాలోని(Ganderbal district) ఫతేపూర్(Fetehpora village) ప్రాంతంలో ఓ చిరుత జనావాసాల్లో సంచరిస్తూ.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీనితో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అందులో ఓ అధికారి ఎడమ చేతిని చిరుత నోటితో అందుకుంది. అయినప్పటికీ అతడు చాలాసేపు చిరుతను అదిమిపట్టేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు అప్రమత్తమైన మిగతా అధికారులు చిరుతను కర్రలతో కొట్టగా అది స్పృహ కోల్పోయింది.

అనంతరం గాయపడిన అధికారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా చిరుతకు ప్రథమ చికిత్స చేసి తిరిగి అడవిలో వదిలేశారు.

50 సెకన్ల నిడివి గల వీడియోలో, ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది, ఆ వ్యక్తి చిరుతపులిని సజీవంగా బంధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కేవలం తన చేతులను మాత్రమే ఉపయోగించి దానితో పట్టుకోవడం చూడవచ్చు.

-By VVA Prasad

See also  YCP Suspended Chittoor MLA: పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే.. వెంటనే సస్పెండ్ చేసిన వైసీపీ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top