35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!

Share the news
35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!

APSRTC బస్సు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

నెల్లూరు: 40 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి కావలి వెళ్తున్న RTC బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు గాయపడగా.. మిగతా 35 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. క్రేన్ సాయంతో రెండు వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-By VVA Prasad

See also  AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top