బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు!

Share the news
బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు!

Bangalore biker పై ఎద్దు దాడి

బెంగుళూరు(Bengaluru) లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనలో, ఒక ఎద్దు(Bull) ఒక బైకర్‌పై దాడి చేసి, ఎదురుగా వస్తున్న ట్రక్కు కింద అతనిని విసిరివేసింది, అయితే అదృష్టవశాత్తూ, ట్రక్ డ్రైవర్ సరైన సమయంలో బ్రేక్‌లను వేయడంతో బెంగళూరు బైకర్(Bangalore biker) తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

మహాలక్ష్మి లే అవుట్ స్విమ్మింగ్ పూల్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సోషల్ మీడియా యూజర్ తెలిపారు. ఆ గంగిరెద్దు, దానికి తోడుగా ఉన్న ఒక మహిళతో నడుస్తూ కనిపించింది, హఠాత్తుగా అది ఒక బైకర్‌పై ఊహించని విధంగా దూసుకెళ్లి, బైకర్ ను ట్రక్కు కిందికి విసిరి వేసింది. ఎద్దు గుద్దుడికి ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న ట్రక్కు క్రింద పడిపోయాడు, అయితే ట్రక్ డ్రైవర్ సమయస్ఫూర్తి తో స్పందించి బ్రేకులు వేయడంతో ట్రక్ చక్రాలు ఆ వ్యక్తి తలకు రెండు అడుగుల దూరంలో ఆగిపోయాయి. బైకర్‌ను పడగొట్టిన తర్వాత, ఎద్దు అక్కడి నుండి పారిపోయింది.

See also  Parliament Security Breach: లోక్‌సభలో చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని ఆగంతుకులు. Parliament పై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్ళు పూర్తయిన రోజే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top