Pushpa2 The Rule: గంగమ్మ జాతరలో గంగ వెర్రులెత్తించే అల్లు అర్జున్ గెట్అప్.. మాస్ జాతరే!

Share the news
Pushpa2 The Rule: గంగమ్మ జాతరలో గంగ వెర్రులెత్తించే అల్లు అర్జున్ గెట్అప్.. మాస్ జాతరే!

సుకుమార్(Sukumar) దర్శకత్వం లో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప2 ది రూల్'(Pushpa2 The Rule) టీజర్ విడుదల కోసం అభిమానులే కాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ , ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 11:07 గంటలకు సినిమా టీజర్ రిలీజ్ అంటూ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను వెర్రెత్తేలా చేసింది. దానితో కంటెంట్ గురించి ఊహాగానాలు ఆకాశాన్ని తాకాయి. పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను పెంచడమే కాక జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా తెచ్చిపెట్టింది. దానితో పుష్ప 2 ది రూల్ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Pushpa2 The Rule ఎలా వుంది?

ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్, పుష్ప ది రైజ్(Pushpa The Rise) కి ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుంది. ఇక ప్యాన్స్ కి మరియు సినిమా అభిమానులకు పండగే. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అనే ఇంట్రెస్ట్ పెంచేలా చేసింది.

See also  Bill Gates met PM Modi: ప్రధాని మోదీ తో బిల్ గేట్స్‌ సమావేశం.. AI, వాతావరణం గురించి చర్చ..

టీజర్ లో అల్లు అర్జున్ గెట్ అప్ చూస్తే చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతరలో మగాళ్లు ఆడవేషం వేసుకుని మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ప్రతిబింబించేలా ఉంది. చీర, చెవి కమ్మలు, నగలు, నెత్తుటితో నుదుటి మీద బొట్టు, మొహంతో పాటు దేహమంతా అలంకారం చూస్తేనే ఒళ్ళు గగుర్పొడించేలా ఉన్నాడు. ఇక దేవత దగ్గరికి వెళ్తూ అడ్డొచ్చిన రౌడీలను తనదైన స్టైల్ లో చితకబాదుతూ వెళ్లే సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుంది సినిమాలో.

ఆగస్ట్ 15 విడుదల తేదీని మరోసారి ధృవీకరిస్తూ పుష్ప 2 ది రూల్ టీజర్ చివర్లో క్లారిటీ ఇచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం, మిరెస్లో కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం సుకుమార్ విజన్ ని చక్కగా ఆవిష్కరించాయి. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన పుష్ప 2 మీద వెయ్యి కోట్ల దాకా బిజినెస్ అంచనాలున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top