Ugadi: తెలుగు సంవత్సరాల వెనక పురాణ కథనం.. నూతన క్రోధి నామ సంవత్సరం రాశిఫలాలు ఏమిటి?

Share the news
Ugadi: తెలుగు సంవత్సరాల వెనక పురాణ కథనం.. నూతన క్రోధి నామ సంవత్సరం రాశిఫలాలు ఏమిటి?

Ugadi వెనక ఒక పురాణ కథనం

బ్రహ్మకల్పం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాలు మొత్తము 60. ఈ తెలుగు సంవత్సరాల వెనక ఒక పురాణ కథనం ఉంధి. బ్రహ్మ మానస పుత్రుడు నారద మహర్షి ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా జన్మించి రాజును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 60 మంది సంతానం కలుగుతారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటారు. అప్పుడు 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని నారధమహర్షి విష్ణువుని ప్రార్ధించగా విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిచ్చారు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ప్రస్తుత నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. ( 60 తెలుగు సంవత్సరాలలో ఈ క్రోధి నామ సంవత్సరం 38వది).

ఉగాది(Ugadi) వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ప్రాణులు కాలస్వరూపమైన ఏడాదిలో నివసిస్తుంటాయి.

See also  Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా!

ఉగాది(Ugadi) నాడు ముఖ్యమైంది పంచాంగ శ్రవణం. ఉగాది(Ugadi) రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోడానికే పంచాంగ శ్రవణం చేస్తారు.

అలాగే పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగానదిలో స్నానం చేసినంత పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ పంచాగ శ్రవణం విన్నవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యత ప్రసాదిస్తారు. ప్రతి నిత్యం సంకల్పం అనగా తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు పటించుట వలన సర్వత్రా శుభప్రదాయకము.

రాజాధి నవనాయక ఫలములు

రాజుచైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతికుజుడు
మంత్రిమేష సంక్రమణ దినాధిపతిశని
సేనాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిశని
సస్యాధిపతికర్క సంక్రమణ దినాధిపతిచంద్రుడు
ధాన్యాధిపతిధనూ సంక్రమణ దినాధిపతికుజుడు
అర్ఘాధిపతిమిథున సంక్రమణ దినాధిపతిశని
మేఘాధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశని
రసాధిపతితులా సంక్రమణ దినాధిపతిగురుడు
నీరసాధిపతిమకర సంక్రమణ దినాధిపతికుజుడు

గ్రహణాలు:

See also  Pawan Election Campaign: ఈ నెల 30 నుంచి జనసేనాని ఎన్నికల శంఖారావం పిఠాపురం నుంచి!

ఈ సంవత్సరం గ్రహణాలు లేవు.

మూఢాలు:

01/05/2024 నుంచి 07/08/2024 వరకు ముహూర్తాలు ఉండవు.

రాశి ఫలితాలు:

రాశిఆదాయంవ్యయంరాజ్యపూజ్యంఅవమానం
మేషం81443
వృషభం2873
మిథునం5536
కర్కాటకం14266
సింహం21422
కన్య5552
తుల2815
వృశ్చికం81445
ధనుస్సు11575
మకరం141431
కుంభం141461
మీనం11524

వ్యాస కర్త:

పంతులుగారు భీష్మ కుమార్ శర్మ
9030243911

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top