Rakshasa Kala Book: జనసైనికుల ఆధ్వర్యంలో రాక్షస కళ పుస్తక ప్రమోషన్!

జనసైనికుల ఆధ్వర్యంలో రాక్షస కళ పుస్తక(Rakshasa kala book) ప్రమోషన్. యుక్తులు కుయుక్తులు సమయస్ఫూర్తి తెలిసినవారికి విజయం వరిస్తుందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ స్పష్టం చేశారు.
Share the news
Rakshasa Kala Book: జనసైనికుల ఆధ్వర్యంలో రాక్షస కళ పుస్తక ప్రమోషన్!

Rakshasa kala book promotion

రేపల్లె(Repalle) : యుక్తులు కుయుక్తులు సమయస్ఫూర్తి తెలిసినవారికి విజయం వరిస్తుందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్(Rasamsetti Mahesh) స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం సనక వెంకట సుధీర్ రచించిన రాక్షస కళ.. ప్రపంచాన్ని మీకు దాసోహం చేయించే క్రీడ అనే పుస్తక(Rakshasa Kala Book) ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు.

Rakshasa Kala Book

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రచయిత సనగా వెంకట సుధీర్ నాలుగు సంవత్సరాల కఠోర శ్రమతో పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారని చెప్పారు. సమాజంలో ఎవరైతే మనపై యుద్ధం చేయాలని చూస్తున్నారో, రాజకీయంగా, వ్యాపార పరంగా వ్యక్తిగతంగా మన ఎదుగుదలను వెనక్కు లాగే వారిపై విజయం సాధించేందుకు, ఈ పుస్తకంలోని అంశాలు, ఉపయోగపడతాయన్నారు. మనుషుల్లో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని నింపే అత్యుత్తమ సాహిత్యం రాక్షస కళ లో దాగి ఉందన్నారు.

See also  Janasena Flag: ఏపీ లోనే కాదు.. ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై కూడా జనసేన జెండా!

రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) సైతం పుస్తకాన్ని చూసి తన జీవిత లో రాజకీయ ఎదుగుదలకు చాలా దగ్గరగా ఈ పుస్తకం ఉందని చెప్పటం అభినందనీయమన్నారు. సమాజంలో ఏ రంగంలో ఉన్న ప్రజలైన ఆ రంగంలో ఎదుగుదల కావాలనుకుంటే ఈ పుస్తకం చదవాలని సూచించారు. ప్రతి ఒక్కరు రాక్షస కళ అనే పుస్తకాన్ని(Rakshasa Kala Book) చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. కార్యక్రమంలో రచయిత సనక వెంకట సుధీర్(Sanaka Venkata Sudheer), కళా రత్న, వేస దాస, కవి తిలక బిరుదులు పొందిన డాక్టర్ సిహెచ్ బాబావలి రావు(Babavali Rao) జనసేన(Janasena) పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top