
ప్రచారానికి Janasena Star Campaigners
మరో వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జనసేన స్టార్ క్యాంపెయినర్లను(Janasena Star Campaigners) ప్రకటించారు . పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు(Naga Babu)తో పాటు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడులను(Ambati Rayudu) స్టార్ క్యాంపెయినర్లుగా జనసేనాని ప్రకటించారు. వీరితో పాటు టాలీవుడ్ నృత్య దర్శకుడు జానీ మాస్టర్(Johnny Master), సినీ, టీవీ నటులు సాగర్, పృథ్విరాజ్(Prithviraj), కమెడియన్లు హైపర్ ఆది(Hyper Adi), గెటప్ శ్రీనులను(Getup Srinu) స్టార్ క్యాంపెయినర్లుగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు#VoteForGlass pic.twitter.com/T5HzqMURqm
— JanaSena Party (@JanaSenaParty) April 10, 2024