
విశాఖలో SPF constable suicide
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య(SPF Constable Suicide) చేసుకున్న ఘటన విశాఖపట్నంలో(Vizag) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన పాలవలస శంకర్రావు అనే వ్యక్తి ద్వారకానగర్ లో జ్యోతి బుక్ డిపో సమీపంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో గన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 5 గంటలకు విధులకు హాజరైన శంకర్రావు 6 గంటల సమయంలో తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతీపై కాల్చుకున్నాడు. ఆ సమయంలో పెద్దగా శబ్దం రావడంతో అక్కడే ఉన్న సిబ్బంది వెళ్లి చూడగా శంకర్రావు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారు ద్వారకా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఈ లోగా తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ సంఘటన మొత్తం సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది
-By VVA Prasad