Hyderabad లో ఓవైసీ కోసం బలహీన అభ్యర్థి.. ప్రతిగా తెలంగాణాలో ముస్లిం ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్లాన్?

Share the news
Hyderabad లో ఓవైసీ కోసం బలహీన అభ్యర్థి.. ప్రతిగా తెలంగాణాలో ముస్లిం ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్లాన్?

Hyderabad లో మజ్లిస్‌కు మేలు చేయనున్న కాంగ్రెస్

హైదరాబాద్(Hyderabad) తో పాటు కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలలో తెలంగాణ(Telangana) కాంగ్రెస్(Congress) పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. నిజానికి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ స్థానంపై ఏ పార్టీ కూడా ఆశలు పెట్టుకోలేదు. కానీ అభ్యర్థుల కసరత్తు ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత హడావుడి చేశారు. సానియా మీర్జాను నిలబెట్టి ఓవైసీకి చెక్ పెడతామన్నట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. ఆమె కాకపోతే ఓవైసీలపై అలుపెరగకుండా పోరాటం చేస్తున్న నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ ను అభ్యర్థిగా ఖరారు చేస్తామన్నారు. అయితే ఇప్పుడు బలహీన నేతను ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మజ్లిస్ అధినేత ఓవైసీని గట్టున పడేయడానికేనన్న విశ్లేషణ ప్రారంభమయింది.

Hyderabad లో గట్టి పోటీ ఇవ్వనున్న బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవీలత

బిజెపి(BJP) అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(Madhavi Latha kompella) గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం(MIM) పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బిసి హిందూ అభ్యర్థిని బరిలో దించి బీజేపీ కి పడే హిందూ ఓట్లను చీల్చితే ఓవైసీకి సహాయం చేసినట్లు ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ వున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కనబెట్టి బిసి అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ హైదరాబాద్ సీటులో కాంగ్రెస్ గెలవదు.. ఇతర చోట్ల మజ్లిస్ మద్దతు ఇస్తే ఇతర సీట్లలో గెలవడానికి అవకాశం ఉంటుందన్న సమీకరణాలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

See also  Alapati: ఆలపాటి అసంతృప్తి!.. 7వ సారి టికెట్ రాలేదని, వరుసగా 6 సార్లు టికెట్ ఇచ్చిన టీడీపీని వీడతారట!

ఇంత కాలం మజ్లిస్(Majlis) విజయరహస్యం పాతబస్తీలోకి తమ పార్టీకి పోటీగా మరో పార్టీ రాకుండా చూసుకోవడమే. ఇందు కోసం మజ్లిస్ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండటం. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉండి, పాతబస్తీలోకి మీరు రావొద్దు.. బయట అంతా మా పార్టీ మీకు మద్దతు ఇస్తుందని ఒప్పందాలు చేసుకుంటారని వినికిడి. ఇక అధికారంలో ఉన్న పార్టీ పాతబస్తీలో హిందూ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీల్చి మజ్లీస్ కు మేలు చేస్తుంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అదే వ్యూహం పాటించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే పాటించారు. ఇప్పుడు రేవంత్ తోనూ అలాంటి ఒప్పందమే చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా.. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓవైసీ(OYC) ప్రచారం చేశారు. అలాంటి పార్టీని… బలహీనపరిచే అవకాశం వచ్చినా వదులుకుంటూ.. ఆ పార్టీతో లోపాయికారీ ఒప్పందాలకే తెలంగాణ కాంగ్రెస్ మొగ్గు చూపుతుంది. మజ్లిస్ మద్దతు లేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ సాయం కాంగ్రెస్ కోరుకుంటోంది.

See also  First AI Software Engineer Devin: మొట్టమొదటి AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్ వచ్చేసింది.. ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ ఫట్టా!

ఇక హైదరాబాద్(Hyderabad) ఎంపీ స్థానాన్ని బీజేపీ ఈ సారి చాలా సీరియస్ గా తీసుకుంది. పాతబస్తీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొంపెల్ల మాధవీలత అనే నేతకు టిక్కెట్ ఇచ్చారు. ఆమె హిందూ ఓటర్లను ఏకం చేసే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి హైదరాబాద్‌లో(Hyderabad) గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించితే.. ఓవైసీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న అభిప్రాయం గట్టిగా వినపిిస్తోంది. హిందూ ఓట్లు చీలి పోవడం వల్లనే మజ్లిస్ ఏకపక్ష విజయాలను నమోదు చేస్తూ వస్తోంది ఇంతకాలం. ఇలాంటి సమయంలో గట్టి ముస్లిం అభ్యర్థిని పెడతారన్న ప్రచారంతో ఓవైసీ అప్రమత్తమై కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందానికి వచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు హిందూ ఓట్లను చీల్చేలా హిందూ అభ్యర్థిని నిలబెట్టేలా కాంగ్రెస్ చూస్తోందని అంటున్నారు. అలా కుదరక పోతే బలహీనమైన ముస్లిం అభ్యర్థిని ఖరారు చేస్తారని చెబుతున్నారు.

See also  Aragen Life Sciences to invest more in Hyderabad: హైదరాబాద్​లో ఆరాజెన్ విస్తరణ!

కొసమెరుపు: 2014 ముందు ఒక లెక్క, తరువాత నుంచి ఒక లెక్క. మెజార్టీ హిందూ అనుకూల రాజకీయాలు చేస్తూ బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడవసారి కూడా బీజేపీ దే అధికారం అంటున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, పాత వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయి. కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీగా గట్టి అభ్యర్థిని నిలబెట్ట లేదంటే అది మజ్లీస్ తో లోపాయికారి ఒప్పందం అని ఎవరికైనా తేలికగా తెలిసిపోతుంది. ఈ విషయాన్ని బీజేపీ బలంగా తీసుకెళ్లి రాష్త్ర వ్యాప్తంగా హిందూ ఓటర్లను ఏకం చేస్తే కాంగ్రెస్ కు మొదటికే వస్తుంది. ఇప్పటికన్నా మైనారిటీ రాజకీయాలు మాని మెజారిటీ వర్గం గురించి ఆలోచిస్తేనే కాంగ్రెస్ కు రాజకీయ భవిష్యత్తు. లేదంటే కేంద్రంలో అధికారంపై ఆశలు వదులుకోవాల్సిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top