Raghubabu Car Accident: సినీనటుడు రఘుబాబు కారుకు ప్రమాదం.. బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం..

సినీనటుడు రఘుబాబు కారుకు ప్రమాదం(Raghubabu Car Accident). బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం. ఈ ఘటన బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Share the news
Raghubabu Car Accident:  సినీనటుడు రఘుబాబు కారుకు ప్రమాదం.. బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం..

Raghubabu Car Accident

ప్రముఖ తెలుగు నటుడు రఘుబాబు కారును బైక్ పై వస్తున్న వ్యక్తి ఢీ కొన్న ఘటన(Raghubabu Car Accident) బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు హైదరాబాద్ నుంచి మిర్యాల గూడ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్ధన్ రావు(53) బైక్ పై వెళ్తూ రాంగ్ రూట్లో వచ్చి రఘుబాబు కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. టూటౌన్ ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

-By VVA Prasad

See also  Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి!

Also Read News

Scroll to Top