Indian Whisky: ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా.. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానం!

ఇండియన్ విస్కీ(Indian Whisky) తో ఆ కిక్కే వేరబ్బా.. మన సింగిల్ మాల్ట్ విస్కీకి విదేశీయులు ఫిదా అయిపోయారు!
Share the news
Indian Whisky: ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా.. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానం!

ఇండియన్ విస్కీ(Indian Whisky) తో ఆ కిక్కే వేరబ్బా!

విదేశాల నుంచి ఎవరైనా వస్తున్నారంటే.. ఫారిన్ లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని అడిగే వారు చాలా మందే ఉన్నారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం మన దేశంలో తయారయ్యే విస్కీని(Indian Whisky) విదేశీయులు బాగా ఇష్టపడుతున్నారు. మన దేశంలోని అనేక బ్రాండ్లు ఇప్పటికే విదేశీయుల మనసులను దోచుకున్నాయి. తాజాగా గోదావన్ సెంచరీ (Godawan Century) సింగిల్ మాల్ట్ విస్కీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇది 2024 లండన్ స్పిరిట్స్ పోటీలో( 2024 London Spirits Competition) అగ్రస్థానంలో నిలిచింది.

నాణ్యత, విలువ, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో 100కి 96 పాయింట్లు సాధించి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన సింగిల్ మాల్ట్ విస్కీలలో రాజు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, లండన్ స్పిరిట్స్ పోటీ మూడు కీలక ప్రమాణాలపై దృష్టి పెడుతుంది. నాణ్యత, విలువ మరియు ప్యాకేజింగ్.. ఈ మూడు అంశాల్లో మెరుగ్గా ఉన్న వారికే ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత వాటి నాణ్యతను పరిశీలిస్తారు. ప్రముఖ ఆల్కహాల్ బ్రాండ్ డియాజియో ఇండియా(Diageo India) ద్వారా గోదావన్ సింగిల్ మాల్ట్ విస్కీ రాజస్థానీ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

See also  APSET 2024 దరఖాస్తులు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం.. పరీక్ష 28th April 2024!

ఆరు వరుసల బార్లీని తక్కువ నీటితో కలపడం మరియు వాటిని 100 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద వేడి చేయడం వల్ల అద్భుతమైన రుచి మరియు గొప్ప సంక్లిష్టత ఏర్పడుతుందని డియాజియో చెబుతోంది. గ్లోబల్ లీడర్ డియాజియోకి అనుబంధంగా ఉన్న డియాజియో ఇండియా ఈ గోదావాన్ విస్కీని తయారు చేస్తోంది. డియాజియో జానీ వాకర్, బ్లాక్ డాగ్, వ్యాట్ 69, యాంటిక్, సిగ్నేచర్, రాయల్ ఛాలెంజ్, మెక్‌డోవెల్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌లను కూడా తయారు చేస్తోంది.

Scroll to Top