Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు!

Share the news
Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు!

Health Insurance కు వయో పరిమితి తొలగింపు!

న్యూ ఢిల్లీ: ఆరోగ్య భీమాకు(Health Insurance) సంబంధించి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పులు చేసింది. పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని తొలగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య భీమా పొందొచ్చు.

“సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులలు సహా కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి అనుగుణంగా భీమా సంస్థలు తమ ప్రొడక్టులను డిజైన్ చేయొచ్చు” అని IRDAI తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ అందించడానికి వీలు పడుతుంది. సీనియర్ సిటిజన్లు వంటి నిర్దిష్ట వయసుల వారికి ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని, వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఛానెల్ను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించింది.

See also  Exit Polls Results: ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరికి తోచింది వారు ప్రకటించారు!

దీంతో పాటు ఆరోగ్య భీమాకు(Health Insurance) సంబంధించి IRDAI మరికొన్ని మార్పులు సైతం చేసింది.
• క్యాన్సర్, గుండె లేదా మూత్రపిండ వైఫల్యం మరియు AIDS వంటి తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు పాలసీలను జారీ చేయడానికి భీమా సంస్థలు నిరాకరించడం నిషేధించబడింది.
• ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, నిరీక్షణ వ్యవధిని (మారటోరియం పీరియడ్) తగ్గించింది. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న నిరీక్షణ వ్యవధిని ఇప్పుడు 3 సంవత్సరాలకు కుదించింది. ఈ నిబంధన వల్ల ఒకవేళ మూడేళ్లు నిరంతరం ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే.. పాలసీదారు మొదట వెల్లడించాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ముందుగా ఉన్న అన్ని షరతులు 36 నెలల తర్వాత కవర్ చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, ఈ 36 నెలల తర్వాత ఇప్పటికే ఉన్న పరిస్థితుల ఆధారంగా క్లెయిమ్‌లను తిరస్కరించడం నుండి ఆరోగ్య బీమా సంస్థలు నిషేధించబడ్డాయి.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top