Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

Share the news
Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం scam కేసులో కవిత కస్టడీ(Kavitha’s custody) పొడిగింపు!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) మే 7 వరకు పొడిగించింది. మంగళవారంతో కవిత కస్టడీ(Kavitha’s custody) ముగియగా.. ED, CBI అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకూ కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు, కవితకు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారని.. కొత్తగా ఏమీ చెప్పడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను ఈడీ కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది.

See also  UPI services: నేటినుంచి శ్రీలంక మరియు మారిషస్‌లలో UPI సేవలు.. ఇక అక్కడ కూడా PhonePe..

అటు, ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సైతం మే 7 వరకూ న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. దీంతో అప్పటివరకూ వీరిద్దరూ తీహార్ జైలులోనే ఉండనున్నారు.

కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. కవిత తిహార్ జైలులో ఉండగానే ఇదే కేసులో ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసి 12న కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అనుమతితో 3 రోజులు కస్టడీలోకి తీసుకుని ఆమెను ప్రశ్నించింది. ఈడీ కేసులో 23 వరకు రిమాండ్‌ ఉండడంతో అదే తేదీ వరకు సీబీఐ కేసులోనూ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top