
Election Commission వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లు
మంగళవారం ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్‍ఆర్ ఆంజనేయులు అయితే మరొకరు విజయవాడ నగర సీపీ కాంతి రాణా. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన EC.
ఇక పోతే బుధవారం వారి స్తానంలో విజయవాడ పోలీస్ కమీషనర్ గా పి.హెచ్.డి రామకృష్ణ మరియు కుమార్ విశ్వజిత్ ను ఇంటిలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

-By VVA Prasad