AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

AMBEDKAR OPEN UNIVERSITY పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల. Ph.D. ఎంట్రన్స్ టెస్ట్ మే 25న హైదరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Share the news
AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

AMBEDKAR OPEN UNIVERSITY పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్!

డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి గాను Ph.D. ఎంట్రన్స్ టెస్ట్ మే 25న హైదరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంగ్లీష్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, కోర్సులలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఇందుకు అర్హులైన అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braou.ac.in లేదా www.braouonline.in నందు ‘ఆన్లైన్’ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ పరీక్షకు ఎంట్రన్స్ ఫీజును రూ.1,500 గానూ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు అభ్యర్థులకు రూ.1000 గానూ నిర్ణయించారు. ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ల ద్వారా కానీ లేదా టీఎస్/ఏపీ ఆన్లైన్ ఫ్రాంఛైజీ కేంద్రాలలో కానీ మే 5 లోపు చెల్లించాలన్నారు.

పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్ను www.braouonline.in లేదా వెబ్సైట్ www.braou.ac.in కానీ, అలాగే ఏమైనా సందేహాలుంటే 040-23680411/498/240లో కానీ సంప్రదించవచ్చని తెలిపారు.

See also  Jana Sainkulu War on YCP: అరాచక శక్తుల పై జనసైనికుల యుద్ధం!

-By VVA Prasad

Also Read News

Scroll to Top