
కొత్తదనం లేని YCP Manifesto 2024
కొత్తదనం లేని YCP Manifesto 2024.. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ..
అంటే ప్రస్తుతం నడుస్తున్న రోడ్ల పై గుంతల పథకం కంటిన్యూ అవుతుందన్నమాట..
ఇసుక దోపిడీ కంటిన్యూ అవుతుంది.. సిపిఎస్ రద్దు హామీ కంటిన్యూ అవుతుంది.. చెత్త పన్ను హామీ కొనసాగుతుంది..
అలాగే మధ్య నిషేధం హామీ కంటిన్యూ అవుతుంది, కానీ అమలు చేయం..
పోలవరం కట్టడం కొనసాగుతుంది, కానీ కంప్లీట్ అవ్వదు.
జాబ్ క్యాలెండర్ హామీ కంటిన్యూ అవుతుంది, కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించం.
ప్రత్యేక హోదా హామీ కొనసాగుతుంది, కానీ ప్రత్యేక హోదా తేలేం.
డీఎస్సీ హామీ కొనసాగుతుంది, కానీ చివరి ఏడాది మాత్రమే ప్రకటిస్తాం.
మూడు రాజధానుల హామీ కొనసాగుతుంది.. కానీ ఎక్కడ రాజధాని అభివృద్ధి చేయం..
ఆంధ్రులారా పైన చెప్పినవి కొన్ని మాత్రమే..
ఇకపోతే మేనిఫెస్టో(YCP Manifesto 2024) విడుదల సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% శాతం పూర్తి చేశారని చెప్పారు.
ఎలాగ ఎలాగ? 2019 మేనిఫెస్టోలో మధ్య నిషేధం హామీ ఇచ్చారు.. అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.. ఐదు నక్షత్రాల హోటల్లో మాత్రమే మద్యం దొరికేలా చేస్తాం.. అన్నారు. చేశారా? లే
వైయస్సార్ కలగన్న జలయజ్ఞాని పూర్తి చేస్తాం.. పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తాం.. అన్నారు . చేశారా? లే
సిపిఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానం పునరుద్దిస్తాం అని 2019 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.. చేశారా? లే
ప్రతి జనవరి ఫస్ట్ కి జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఈ 5 సంవత్సరాలలో ఒకసారైనా ప్రకటించారా? లే
ఇక ప్రత్యేక హోదా హామీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని బీరాల పల్కి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అయిన దానికి, కానీ దానికి అన్నిటీకి కేంద్రం కు మెడలు వంచారు మీ కేసుల గురించి.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.. మరి ఏ లెక్కన 2019 హామీలు 99% పూర్తి అయినట్లు చెబుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు(Jagan Mohan Reddy).