AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ వేటు!

Share the news
AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ వేటు!

AP DGP రాజేంద్రనాథ్ రెడ్డి పై ట్రాన్స్ఫర్ వేటు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. AP DGP పై ఎన్నికల కమిషన్(EC) బదిలీ వేటు వేసింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇక డీజీపీ స్థానం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించరాదని ఉత్తర్వులలో ఈసీ స్పష్టం చేసింది. ఏపీ డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్ ను ఈసీ ఆదేశించింది. సోమవారం (మే 6) ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారులను షార్ట్ లిస్ట్ చేసి తమకు పంపాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో డీజీపీపై ఈసీ చర్యలు చేపట్టింది.

See also  TDP-Janasena: టీడీపీ-జనసేన పొత్తు బాగు.. ఇద్దరి మధ్య సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక మాత్రం జాగు..

డిజిపి హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టి మరి కె.వి రాజేందర్ రెడ్డిని ఇన్చార్జి డిజిపిగా నియమించిన YCP ప్రభుత్వం. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదేపదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. AP డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదు. ఆఖరికి ఎన్నికల సమయంలో EC దెబ్బకి అయన ట్రాన్స్ఫర్ మీద వెళ్లాల్సి రావడం శుభపరిణామం. ఈసీ దెబ్బకు, జగన్ ప్రభుత్వం ఆయన్ని ఎన్నికలప్పుడు ఉపయోగించుకోవాలని వేసిన పధకం పారలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top