Janasena Flag: ఏపీ లోనే కాదు.. ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై కూడా జనసేన జెండా!

జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు. ఇంగ్లాండ్ లోని వాస్‌డేల్ పర్వతాన్ని అధిరోహించి జనసేన జెండాను(Janasena Flag) ఎగురవేశాడు. గాజుగ్లాసుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు.
Share the news
Janasena Flag: ఏపీ లోనే కాదు.. ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై కూడా జనసేన జెండా!

జనసేన(Janasena) అధినేత, పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన NDA కూటమిలో భాగమై పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన, ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అభిమానులు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ జనసేనకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈసారి పవన్ కల్యాణ్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వాస్‌డేల్ పర్వతం(Wasdale Mountain) మీద జెనసేన జెండా(Janasena Flag)

తాజాగా ఇంగ్లండ్ లో ఓ యువకుడు జనసేన గెలుపు కోసం ఏకంగా వాస్‌డేల్ పర్వతాన్ని అధిరోహించాడు. ఎంతో కష్టపడి పర్వత శిఖరానికి చేరుకుని జనసేన జెండా(Janasena Flag)ను ఎగురవేశాడు. తన వెంట తీసుకెళ్లిన గాజు గ్లాసులో చాయ్ తాగుతూ, జనసేనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. తన కోసం, తన పార్టీ కోసం ఆ యువకుడు అందించిన మద్దతుకు ధన్యవాదాలు చెప్పారు. “జనసైనికుడు ఇంగ్లాండ్ లోని పర్వతం మీద సగర్వంగా జనసేన జెండాను ప్రదర్శించడం ఎంతో సంతోషాన్ని నింపింది. ఆయన కష్టపడి పర్వతాన్ని అధిరోహించడం చూస్తుంటే, నా హృదయం ఉప్పొంగుతోంది. అతడు వేసే ప్రతి అడుగు మార్పు, న్యాయం కోసం పరితపిస్తోంది. మీ నిరంతర మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా మీద మీరు కనబరుస్తున్న నమ్మకానికి ధన్యవాదాలు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

See also  Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న!

ఇంతకి వాస్‌డేల్ పర్వతం ప్రత్యేకత ఏమిటి?
ఇంగ్లాండ్‌లోని కుంబ్రియాలోని లేక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్‌లో ఉన్న వాస్‌డేల్ మౌంటైన్, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మరియు సవాలు చేసే హైకింగ్ ట్రయల్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది 978 మీటర్లు (3,209 అడుగులు) ఎత్తులో ఉన్న ఇంగ్లండ్‌లోని ఎత్తైన శిఖరం స్కాఫెల్ పైక్‌కు నిలయం. ఈ ప్రాంతం అవుట్‌డోర్ ఔత్సాహికులలో ప్రసిద్ధి చెందింది, ఇంగ్లాండ్‌లోని లోతైన సరస్సు అయిన వేస్ట్ వాటర్‌తో సహా చుట్టుపక్కల లోయలు మరియు సరస్సుల యొక్క ఉత్కంఠభరితమైన వీక్షణలను అందిస్తుంది. వాస్డేల్ పర్వతం చరిత్రలో నిటారుగా ఉంది, వేల సంవత్సరాల నాటి మానవ నివాసానికి సంబంధించిన రుజువులతో, సందర్శకులు మరియు సాహసికుల కోసం దాని ఆకర్షణను జోడిస్తుంది.

Scroll to Top