
NDA కూటమిదే అధికారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ ఓ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి(NDA) అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ(YCP)కి ప్రస్తుతం 51 సీట్లు కూడా దాటవని పేర్కొన్నారు. దీనికి ముఖ్య కారణం.. కూటమికి అనుకూలంగా వచ్చే ఓట్ల కంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఓట్లు ఎక్కువగాఉండబోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో తాను ఐ-ప్యాక్‌తో ఉన్నపుడు 2019లో వైసీపీకి పని చేశానని, అప్పుడు ఆ పార్టీకి నవరత్నాలు అనే పథకానికి రూప కల్పన చేశానని, పైగా జగన్ గెలుపు కోసం అప్పట్లో ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల రాష్ట్రమంతా తిరిగారని, దానివలన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అక్కడితో తన పని అయిపోయిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయని, జగన్ సీఎం ఐన తరువాత తీసుకున్న నిర్ణయాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని ఆయన తెలిపారు.
-By VVA Prasad