Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

Share the news
Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

Hyderabad Metro for Sale?

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ(L&T) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) ప్రాజెక్టును విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో చాలా తక్కువ కాలంలోనే అత్యధిక ఆక్యుపెన్సీతో విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తూ నగరంలోని ప్రయాణికుల మన్ననలు అందుకుంది.

ఇంతలో.. ఇటీవల తెలంగాణాలో(Telangana) విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పించడంతో మెట్రో రైల్‌ కు ఆదరణ కరువై.. ముఖ్యంగా లేడీస్ కంపార్ట్‌మెంట్లు నిత్యం వెలవెలబోతున్నాయి. దీంతో 2026 తరువాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను అమ్మేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ఎల్ అండ్ టీ సంస్థ డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ బిజినెస్ టుడే TV ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

See also  Arvind Kejriwal: ED సమన్ల ఎగవేసిన కేసు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్

-By VVA Prasad

Also Read News

Scroll to Top