Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్!

Share the news
Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్!

Modi with Chiranjeevi and Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేస్తుంటే… సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లి పోయింది. ఇక సభకు వచ్చిన వారంతా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రి పవన్ కల్యాణ్‌ తన అన్న చిరంజీవి కాళ్లకు దణ్ణం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌ మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సభలో అడుగుపెట్టీ పెట్టగానే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

ఇకపోతే ప్రమాణ స్వీకారం ఐన తరువాత ప్రధాన మంత్రి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని వెంట పెట్టుకుని మరి చిరంజీవి దగ్గరకు వచ్చారు. ముగ్గురు(Modi with Chiranjeevi and Pawan Kalyan) కొద్ది సేపు ముచ్చటించారు. ముగ్గురు కలిసి చేతులు ఎత్తి మరి ప్రజలకు అభివాదం చేశారు. దాంతో సభ దద్దరిల్లి పోయింది ఒక్కసారిగా. ఇదే ఇప్పుడు సభకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారింది,

See also  Is YSRCP getting troubles Before Elections? కొత్త In charge ల నియామకంతో వైసీపీ నేతల్లో మొదలైన టికెట్ల అలజడి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top