Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

Share the news
Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

Chiranjeevi Meets Telangana CM

ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy)ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పలు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ‘మెగా 156’ అనే ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ తొలిసారి సంతకం చేసిన ఈ ఫాంటసీ చిత్రానికి ‘బింబిసార’తో తొలిసారి దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ (Viswambhara) అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా షూటింగ్ జనవరి మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ ‘మెగా 156’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

See also  Top 10 Most Viewed South Indian Actors in 2024: తస్సాదియ్యా ఆ యువ హీరో ప్రభాస్ ని దాటేసాడుగా!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top