Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట!

Driving car through the river: క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు వరుస సెలవులతో హిమాచల్‌ ప్రదేశ్‌‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా పక్కనే ఉన్న నది (River)లో నుంచి వాహనం నడిపారు
Share the news

Driving car through the river

Christmas, New year ముందు వరుసగా సెలవుల రావడంతో హిమాచల్‌ ప్రదేశ్‌‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి… కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. వాహనాలు ముందుకు కదలక గంటలకొద్దీ రోడ్లపైనే జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా పక్కనే ఉన్న నది (River)లో నుంచి వాహనం నడిపారు.

లహాల్‌ వ్యాలీలోని చంద్రా నదిలో కొందరు టూరిస్టులు సోమవారం సాయంత్రం మహీంద్రా థార్‌ SUV లో(Driving car through the river) ప్రయాణించారు. నీటి మట్టం తక్కువగా ఉండటం వాళ్ళ అదృష్టం, దానితో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, వారి ప్రవర్తన పై స్థానికుల నిరసనలు తెలపడం, మరోపక్క సోషల్ మీడియా లో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కూడా స్పందించారు. ఆ వాహనానికి చలానా వేశారు. స్థానిక ఎస్పీ మయాంక్ చౌధురి మాట్లాడుతూ.. ‘‘చంద్రా నదిలో వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని .. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆ వాహనంపై చర్యలు తీసుకున్నాం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చూడడానికి నదీ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించాం’’ అని ఆయన చెప్పారు.

See also  #BoycottMaldives: భారత్ కు అనుకూలంగా మన సెలబ్రిటీస్.. మాట జారిన ముగ్గురు మాల్దీవుల మంత్రుల పై వేటు..

కాగా, గత మూడు రోజుల్లో అటల్‌ టన్నెల్‌ మార్గంలో దాదాపు 55 వేల వాహనాలు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం సిమ్లాకు ఈ వారంలో మరో లక్షకు పైగా వాహనాలు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పర్యాటకుల రాక ఆతిథ్య రంగానికి ఊపు ఇచ్చినప్పటికీ నిర్వహణ సవాల్‌గా మారింది. సిమ్లాలోని రోడ్లపై ప్రస్తుతం 60 వేల వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. టూరిస్ట్ సీజన్‌లో సిమ్లాకు సాధారణ రోజుల్లో సగటున 12 వేలు వాహనాలు, వారాంతాల్లో 26 వేల వరకూ బయట నుంచి వస్తుంటాయి.

Also Read News

Scroll to Top